టాలీవుడ్‌లో బాలీవుడ్ బ్రదర్స్ బిజీగా.. తెలుగు హీరోలకు టఫ్ ఫైట్ ఇస్తున్న స్టార్ యాక్టర్స్ ఎవరో తెలుసా?
గడిచిన ఈ రెండు మూడేళ్ళలో పాన్ ఇండియా వైడ్ గా సినిమాల్లో చాలా మార్పులు వచ్చేవి. ఎప్పుడో నాలుగైదు దశాబ్దాల కాలం కితమే వచ్చే లాంటి మల్టీ స్టారర్స్ ఇంకా ఒక భాషా నుంచి మరో భాషలో దర్శకులు హీరోలు ఒకరితో ఒకరు వర్క్ చేయడం వంటివి జరిగాయి. కానీ ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితులు మొదలయ్యాయి.
ఎక్కువగా తెలుగు దర్శకుడు హిందీ హీరోలతో హిందీ దర్శకులు తెలుగు హీరోస్ తో వర్క్ చేస్తూ ఒక క్రేజీ వాతావరణం ఇపుడు కనిపిస్తుంది. కాగా అలా బాలీవుడ్ నుంచి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. వీరికి ఒకప్పుడు బాలీవుడ్ లో మంచి ఫేమ్ భారీ హిట్లు ఉన్నాయి. కానీ తర్వాత ఫేడ్ అవుట్ అయ్యి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. అలాంటి హీరోల గురించిన వివరాల్లోకి వెళితే..

మరి ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం ఫుల్ బిజీగా అందులోని మన టాలీవుడ్ లో బిజీగా మారడం గమనార్హం. ఇంతకీ వారే బాలీవుడ్ స్టార్స్ సన్నీ డియోల్, బాబీ డియోల్. వీరిలో మన తెలుగు ఆడియెన్స్ కి వెంటనే స్ట్రైక్ అయ్యేది మాత్రం బాబీ అని చెప్పాలి. టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ సినిమా బాబీ డియోల్ కెరీర్ ని మలుపు తిప్పేసింది.
తనలోని వెర్సటాలిటీ, పొటెన్షియల్ ని చూపించిన ఈ చిత్రం దెబ్బకి సన్నీ డియోల్ బాగా ఫేమస్ అయ్యాడు. అలా ఇపుడు తాను సౌత్ లో భారీ సినిమాలు చేస్తున్నాడు. వీటిలో మన తెలుగు నుంచే బాలయ్య 109వ సినిమాలో విలన్ గా అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా సినిమా హరి హర వీరమల్లు సినిమాలో కూడా విలన్‌గా నటిస్తున్నాడు.
ఇంతే కాకుండా తమిళ్ లో సూర్య నటిస్తున్న కంగువ అనే సినిమాలో కూడా తాను విలన్ గా చేస్తూ తెలుగులో ఎక్కువ సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే బాబీ విలన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుంటే తన అన్న సన్నీ డియోల్ మాత్రం హీరోగానే ఎంట్రీ ఇస్తున్నాడు.

హిందీలో సెన్సేషనల్ గ్రాసర్ 500 కోట్లకి పైగా వసూళ్లు కొల్లగొట్టిన "గదర్ 2" లో హీరోగా చేసి మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన సన్నీ డియోల్ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని ఓ భారీ ప్రాజెక్ట్ ని జస్ట్ రీసెంట్‌గా అనౌన్స్ చేయడంతోపాటు శనివారం అంటే జూన్ 22వ తేదీన షూటింగ్ ప్రారంభించడం తెలిసిందే. దీనిని ఇండియాలోనే బిగ్గెస్ట్ మాస్ ప్రాజెక్ట్ అంటూ ప్రొజెక్ట్ చేస్తున్నారు.
ఇలా ఈ ఇద్దరు డియోల్ బ్రదర్స్ ఆసక్తికరంగా మన తెలుగు సినిమాలో తెలుగు సినిమా టెక్నీషియన్స్ తో ఫుల్ బిజీగా మారారని చెప్పాలి. అంతేకాకుండా తెలుగు హీరోలకు బలమైన విలన్లుగా మారారు. కాగా ఈ ఇద్దరికీ తెలుగు ఆడియెన్స్ ని ఎలాంటి ఆదరణ లభిస్తుందో, తెలుగులో కూడా స్థిరపడతారో లేదో కొన్నాళ్ళు ఆగి చూడాలి మరి.


Click it and Unblock the Notifications











