Gadar 2 గదర్ 2 రికార్డు కలెక్షన్లపై సన్నీడియోల్ షాకింగ్ కామెంట్స్.. పాకిస్థాన్‌లో అంటూ
బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ నటించిన గదర్ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపిస్తున్నది. ఆగస్టు 11వ తేదీన రిలీజైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారతీయ ప్రేక్షకుల ఉన్న ప్రతీ ప్రాంతంలో భారీ కలెక్షన్లు వసూలు చేస్తున్నది. ఈ సందర్బంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రమోషన్స్ ఈవెంట్‌లో సన్నీడియోల్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా సన్నీడియోల్ ఫిల్మీబీట్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..
గదర్ చిత్రం బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల తుఫాన్‌తో ముందుకెళ్తున్నది. భారీ కలెక్షన్లు సాధిస్తూ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్నది. ఈ సినిమా గత ఆరు రోజుల్లో ఇండియాలో దాదాపు 264 కోట్ల రూపాయలు, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 320 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. గదర్ 2 సినిమా సాధించిన కలెక్షన్ల గురించి సన్నీడియోల్ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
గదర్ 2 సినిమా కంటే ముందు గదర్ ఏక్ ప్రేమ్ కథను ప్రేక్షకులు, ప్రజలు గుండెల్లో పెట్టుకొన్నారు. గదర్ 2 సినిమా తీసే ముందు ప్రజలు, ప్రేక్షకుల అంచనాలను చేరుకొంటుందని కచ్చితంగా మా మనసులో నమ్మకం ఉంది. గదర్ కథ ప్రతీ ఒక్కరి గుండెల్లో నిలిచిపోయింది. ఆ అంచనాలను దృష్టిలో పెట్టుకొని గదర్ 2 ను నిర్మించాం. అందుకే ప్రతీ ఒక్కరు సినిమాను ఆదరిస్తున్నారు అని సన్నీడియోల్ చెప్పారు.
గదర్ 2 సినిమా ప్రేక్షకుల అంచనాలు లేకపోతే ఇలాంటి రెస్సాన్స్, ఆదరణ ఉండేది కాదు. ప్రతీ ఒక్కరు ఈ సినిమాపై చూపిస్తున్న ప్రేమకు చాలా ఆనందం కలుగుతున్నది. చాలా మంది ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నామని చెప్పడం ఇంకా ఆనందం కలిగిచింది. ఆ విషయం తెలిసినప్పుడు కలిగిన తృప్తి మాటల్లో చెప్పలేం అని సన్నీడియోల్ అన్నారు.

గదర్ 2 చిత్రం రిలీజ్ తర్వాత పాకిస్థాన్‌ను పరేషాన్ చేశామనే వాదనలో బలం లేదు. ఎందుకంటే వారిని అసంతృప్తికి గురి చేయలేదు. మీరు చెప్పి చెప్పి వార్తలు రాయడం వల్ల ఆ వాదన అలా ప్రచారమైంది. నేను వాఘా బోర్డర్ వద్దకు వెళ్లినప్పుడు పాకిస్థాన్ ప్రజలు నాతో చాలా స్నేహంగా ఉన్నారు. నన్ను చూసి చాలా సంతోషంగా చేతులు ఊపారు. అంతకంటే వారి నుంచి కావాల్సిన ప్రేమ ఏముంది అని సన్నీడియోల్ అన్నారు.


Click it and Unblock the Notifications











