సినీ ఆఫర్ తో ఆమె పోర్న్ ఫిలింలకు డిమాండ్
వివాదాస్పద రియాల్టీ షో 'బిగ్ బాస్ 5' ద్వారా భారత్‌కు వచ్చిన సన్నీ లియోన్ ఇక్కడ ప్రముఖ దర్సకుడు మహేష్ భట్ దృష్టిలో పడి సినిమా ఆఫర్ సంపాదించిన సంగతి తెలిసిందే. 'జిస్మ్-2'టైటిల్ తో రూపొందే ఈ చిత్రంలో ఆమె మిస్టరీ గాళ్ గా కనిపిస్తుందని, మిగిలిన తారాగణాన్ని త్వరలో ప్రకటిస్తామని భట్ ప్రకటించారు. అయితే ఆ సినిమాలో ఎంత డబ్బు వస్తుంది. ఎంత కీర్తి వస్తుంది అనేది ప్రక్కన పెడితే ఇక్కడ ఆమె మార్కెట్ మాత్రం విపరీతంగా పెరిగిందని బాలీవుడ్ మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆమె ఫోర్మ్ ఫిలింలకు ఇంతకుముందు లేని డిమాండ్ ఆసియాలో ఏర్పడిందని చెప్తున్నారు.
ఇక సినిమా విడదలయ్యాక అయితే ఏ మేరకు డిమాండ్ పెరుగుతుందనేది ఊహించలేమని అంటున్నారు. ఇక ఈ విషయాన్ని సన్ని లైట్ గా తీసుకుంది. బాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడైన భట్ నేతృత్వంలో నిర్మించబోయే 'జిస్మ్-2'లో తనకు అవకాశం రావడం గొప్ప గౌరవమని భారత సంతతి కెనడా పోర్న్ స్టార్ సన్నీ లియోన్ పేర్కొంది. ''నటిగా భారత్‌లో తొలి అవకాశం రావడం నాకు చాలా ఉత్కంఠగా ఉంది. మహేష్ భట్, పూజా భట్‌లకు చిత్రపరిశ్రమలో ఎంతో గౌరవం ఉంది. వీరి గురించి తెలుసుకున్న తర్వాత ఈ చిత్రంలో నటించాలని నన్ను అడగటం ఎంతో గౌరవంగా అనిపించింది'' అని మహేష్ భట్ యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో సన్నీ వ్యాఖ్యానించింది.


Click it and Unblock the Notifications











