twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇప్పుడే పిల్లలకు అలాంటివి నేర్పించేస్తోంది.. సన్నీ లియోన్ అంటే మామూలు విషయం కాదు!

    |

    సన్నీ లియోన్ అంటే సెక్స్ ఐటెమ్, శృంగార తార, ఐటెం గర్ల్‌గానే చూస్తుంటారు కొందరు. కానీ ఆమెలో ఉన్న దయాగుణాన్ని, సేవా దృక్పథాన్ని, మాతృప్రేమను మాత్రం ఎవ్వరూ చూడరు. సన్నీ లియోన్‌ గురించి ప్రపంచమంతటికీ తెలుసు. ఒకప్పుడు పోర్న్ ఇండస్ట్రీని ఏలిన సన్నీ లియోన్ ప్రస్తుతం వాటన్నంటికి దూరంగా ఉంటోంది. భారత సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి.. తనకంటూ ఓ గుర్తింపును ఏర్పర్చుకుంది.

    బోల్ట్ కంటెంట్..

    బోల్ట్ కంటెంట్..

    శృంగార ప్రపంచంలోంచి వచ్చిన సన్నీలియోన్ వెండితెరపైనా ఘాటుగానే కనిపించింది. నటించింది. బాలీవుడ్‌లో సన్నీ లియోన్ రేపిన సెగలకు అక్కడి వారంతా షాక్ అయ్యారు. దక్షిణాదిలోనూ సన్నీలియోన్ ప్రత్యేక పాత్రల్లో, పాటల్లో నటించింది.

    సోషల్ మీడియాలో హల్చల్..

    సోషల్ మీడియాలో హల్చల్..

    సన్నీలియోన్ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో రచ్చ చేస్తూ ఉంటుంది. హాట్ హాట్ ఫోటో షూట్లతో, మత్తెక్కించే ఫోటోలతో నెటిజన్లకు పిచ్చెక్కిస్తూ ఉంటుంది. సన్నీ లియోన్ షేర్ చేసే ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతూ లక్షల్లో లైకులను కొల్లగొడుతుంది.

     స్పెషల్ బిజినెస్..

    స్పెషల్ బిజినెస్..

    సన్నీ లియోన్ రెండు చేతులా సంపాదించేందుకు భలే స్కెచ్ వేసింది. ఇటు సినిమాల ద్వారా కాకుండా వ్యాపారం రంగంలోనూ డబ్బులు సంపాదించలేని సన్నీలియోన్ భావిస్తోంది. అందుకు సౌందర్య ఉత్పత్తులను తన సొంత బ్రాండ్ పేరుతో మార్కెట్లో విక్రయిస్తూ ఉంటుంది. వీటికి సంబంధించిన వివరాలు, డిస్కౌంట్స్ అన్నీ కూడా తానే ప్రమోట్ చేస్తూ ఉంటుంది.

    లాక్ డౌన్‌లో స్పెషల్..

    లాక్ డౌన్‌లో స్పెషల్..

    లాక్ డౌన్ సమయంలో సన్నీ లియోన్ మరింత కొత్తగా ఆలోచించింది. రోజుకో సెలెబ్రిటీని తీసుకొచ్చి లైవ్‌లో కూర్చోబెట్టింది. లాక్డ్ అప్ విత్ సన్నీ అంటూ రోజూ చేసే ఇంటర్వ్యూలు తెగ వైరల్ అయ్యేవి. లాక్ డౌన్ సమయంలో చేసిన ఫోటో షూట్లు సైతం ఓ రేంజ్‌లో రచ్చ చేశాయి.

     పిల్లలను దత్తత..

    పిల్లలను దత్తత..

    సన్నీ లియోన్ మూడేళ్ల క్రితం ముగ్గురు పిల్లలను (నిషా, నోహ్, ఆషర్) దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. భర్త డానియెల్ వెబర్‌తో, పిల్లలతో కలిసి సన్నీలియోన్ ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతోంది. ఈ మధ్య నిషా బర్త్ డే సందర్భంగా సన్నీ లియోన్ ఎమోషనల్ అయింది. నిషాకు మూడేళ్లు నిండటంతో ఎంతగానో సంతోషిస్తూ.. ప్రేమను కురిపించింది.

    అన్నీ విషయాలు నేర్పిస్తోంది..

    అన్నీ విషయాలు నేర్పిస్తోంది..

    అయితే సన్నీ లియోన్ మాత్రం తన పిల్లలు అన్ని విషయాల్లో ఆరితేరి ఉండాలని భావిస్తోంది. ఈ మేరకు పిల్లలకు ఫైర్ సేఫ్టీకి సంబంధించిన వివరాలను చెప్పేందుకు కాలిఫోర్నియాలోని ఓ ఫైర్ స్టేషన్‌కు తీసుకెళ్లింది. ఈ మేరకు సన్నీ లియోన్ షేర్ చేసిన ఫోటోలు, కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

    Recommended Video

    If Sunny Leone Stand Next To Trump 10 Million People Welcome Him
    వెల కట్టలేం..

    వెల కట్టలేం..

    ఓ స్వచ్చంద సంస్థ తన పిల్లలకు ఫైరీ సేఫ్టీపై అవగాహన కల్పించడంపై సన్నీ స్పందిస్తూ.. ‘మా పిల్లలను సంతోషంగా ఉండేలా చేయడం, వారికి ఫైర్ సేఫ్టీపై అవగాహన కలిగించినందుకు థ్యాంక్స్. జీవితంలో కొన్నింటికి వెలకట్టలేం. అలాంటి వాటిలో ఇదొకటి. స్వార్థం లేని స్వచ్చంద సంస్థ మాకు, మా కుటుంబంపై ఎంతో ప్రేమను చూపించింది. స్టేషన్ 88కు థ్యాంక్స్' అని ఎమోషనల్ అయింది.

    English summary
    Sunny Leone About Her Daughter Nisha Birthday. 3yrs ago you chose us...us to be your mama & papa...to trust us to take care of you...to show us what real love is...the second I laid eyes on you, I knew you were my daughter.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X