»   » కేసు... విచారణ‌: పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన సన్నీలియోన్

కేసు... విచారణ‌: పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన సన్నీలియోన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: బాలీవుడ్‌ నటి సన్నీలియోన్ బుధవారం మహారాష్ట్రలోని థానేలో పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. ఆమెపై ఇటీవల అసభ్యకరమైన సన్నివేశాలను సోషల్‌మీడియాలో , వెబ్ సైట్లలలో ప్రచారం చేస్తున్నారని కేసు నమోదైన సంగతి తెలిసిందే.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ కేసులో వివరణ ఇచ్చేందుకు, వాంగ్మూలం నమోదు చేయడానికి ఆమె థానేలోని సైబర్‌ క్రైం సెల్‌కు హాజరై పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఆమె భారతీయులను, భారత్‌ను గౌరవిస్తున్నట్లు చెప్పారని ఓ పోలీసు అధికారి వెల్లడించారు.

కేసు విషయానికి వస్తే....

Sunny Leone, Accused in Obscenity Case, Visits Thane Police Station

అడల్ట్ స్టార్ ఇమేజ్ ని వదిలించుకుని బాలీవుడ్ హీరోయిన్ గా ఎదగాలనే సన్నీలియోన్ కి కలిసి వస్తున్నట్లులేదు. ఆమెపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఆమె అర్ధనగ్న, నగ్న దృశ్యాలు ఇంటర్నెట్‌లో ఉన్నాయంటూ, వాటి వలన యువత పెడదారిన పడుతోందంటూ కేసుల మీద కేసులు పడుతున్నాయి. రెండు రోజుల క్రితం ముంబై నుంచి ఓ సామాజిక కార్యకర్త ఈ విషయమై పిర్యాదు చేసిన విషయం మరువక ముందే మరో కంప్లైంట్ వచ్చింది.

తాజాగా చెన్నై, పోరూర్ కు చెందిన మోసస్ అనే సమాజ సేవకుడు నటి సన్నీలియోన్ పై నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆదివారం ఫిర్యాదు చేశారు. అందులో ఆయన పేర్కొంటూ.. ఇటీవల ఒక కుర్రాడు తనను కలిశారన్నారు.అప్పుడు క్రికెట్ కళాకారుడు సునిల్‌గవాస్కర్ గురించి కొంత సమాచారం తెలుసుకోవడానికని అతని సెల్ ఫోన్లో సన్ని అనే పేరుతో నెట్‌ను ఓపెన్‌చేయగా, అందులో నటి సన్ని లియోన్ అశ్లీల దృశ్యాలు పలు చోటు చేసుకున్నట్టు తెలిపారు.

ఇలాంటి దృశ్యాలు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతాయని , బాల నేరస్తులుగా మార్చే అవకాశం ఉందని, కాబట్టి ఇలాంటి దృశ్యాలను ప్రవేశ పెట్టిన ఇంటర్నెట్ సంబంధించిన వారిని అశ్లీల ఫోజు ఇచ్చిన నటి సన్నిలియోన్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

Sunny Leone, Accused in Obscenity Case, Visits Thane Police Station

ఇక ఇప్పటికే...

వెబ్ సైట్లలో అశ్లీల చిత్రాలను ఉంచినందుకు సినీ నటి సన్నీలియోన్ పై థానే పోలీసులు కేసు నమోదు చేశారు. సన్నీ లియోన్ పై ఐపిసి సెక్షన్లు 292, 294ఎ, సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అంజలి పలన్ అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు.

మరో ప్రక్క సన్నిలియోన్ కు ..

దక్షిణాదిన క్రేజ్ రోజు రోజుకీ పెరుగుతోంది. బాలీవుడ్‌ నటి సన్నీలియోని త్వరలో 'లవ్‌ యూ అలియా' అనే కన్నడ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించి, ప్రత్యేక గీతంలో నృత్యం చేయనుంది. ఈ సినిమా దర్శకుడు ఇంద్రజిత్‌ మాట్లాడుతూ జూన్‌లో సన్నీలియోనికి సంబంధించిన భాగం చిత్రీకరిస్తామని తెలిపారు. హీరో సుదీప్‌ కూడా ఈ చిత్రంలో అతిథి పాత్రలో మెరవనున్నారు. ఇది వరకే 'డికే' అనే కన్నడ సినిమాలో సన్నీ ప్రత్యేక గీతంలో నర్తించింది.

English summary
Sunny Leone visited the cyber crime cell of the Thane Police to record a statement in an obscenity case filed earlier this month by a Mumbai housewife.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu