కరోనా కోరల్లో సన్నీ లియోన్.. భర్త మాట వినకుండా అమెరికా ప్రయాణం!
శృంగారతారగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సన్నీ లియోన్ వ్యక్తిగతంగా కూడా జనాలను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఎన్ని విమర్శలు వచ్చినా ఎంత మంది ఎలాంటి కామెంట్స్ చేసినా కూడా ఆమె ఒకరిని బాదించేలా ఎన్నడు విమర్శలు చేయలేదు. ఒక పాపను దత్తత తీసుకొని ఎంతో మందికి ప్రేరణగా నిలిచింది. ఇక రీసెంట్ గా సన్నీ అమెరికా వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది.

సన్నీ స్పెషల్..
శృంగార నటిగా సన్నీలియోన్ ఎన్నో సినిమాలతో క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ కోలీవుడ్ టాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని భాషల్లో వీలైనంత వరకు స్పెషల్ సాంగ్స్ లో దర్శనమిస్తోంది. సినిమాను బట్టి రెమ్యునరేషన్ కూడా చాలా తక్కువ తీసుకుంటుందని ఒక మంచి టాక్ కూడా ఉంది. దీంతో ఇండస్ట్రీలో సన్నీపై ఒక ప్రత్యేక గౌరవం పెరుగుతోంది.

అమెరికా ప్రయాణం..
సన్నీ లియోన్ రీసెంట్ గా అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది. అసలే అక్కడ కరోనా కేసుల గోల పెరుగుతుంటే సన్నీ లియోన్ అక్కడికి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. అమెరికాలో పరిస్థితులు రోజురోజుకు దారుణంగా మారుతున్నాయి. ఇప్పటికే 20లక్షలకు పైగా కేసులు నమోదవ్వగా 2లక్షల మందికి పైగా మరణించారు. ఇలాంటి సమయంలో ఇండియాలో ఉన్న అమెరికా వల్లే మా దేశం వెళ్ళము అంటుంటే సన్నీ మాత్రం తన కుటుంబం కోసం వెళ్లింది.

అత్తకోసమే..
భర్త డేనియల్ తల్లి అమెరికాలో ఉంటోంది. అయితే ఆమె గత కొంత కాలంగా కొడుకు మనవళ్ళకు దూరంగా ఉంటోంది. వాళ్ళని ఎలాగైనా చూడాలని చాలా రోజులుగా వెయిట్ చేస్తోంది. అయితే అనుకోకుండా కరోనా వచ్చి ఇబ్బంది పెట్టడంతో సన్నీ అమెరికా టూర్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు మొత్తానికి ఆమె అత్త దగ్గరకు చేరుకున్నట్లు తెలుస్తోంది.
Recommended Video

భర్త మాట వినకుండా..
కొన్ని రోజుల తరువాత పరిస్థితులు అదుపులోకి వచ్చిన తరువాత వెళదామని భర్త డేనియల్ చెప్పినప్పటికీ సన్నీ అత్త కోసం అగ్రరాజ్యానికి వెళ్లింది. ఇకపోతే ప్రస్తుతం ముంబై నగరంలో కూడా రోజురోజుకి కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. అలాంటి సమయంలో సన్నీ లియోన్ పెద్ద సాహసమే చేసి అమెరికా వెళ్లింది. అక్కడ తన పిల్లలతో కొన్నాళ్లపాటు సరదాగా గడిపి.. అనంతరం ఇండియాకు తిరిగి రానుందట.


Click it and Unblock the Notifications











