పాముతో సన్నీలియోన్‌పై దాడి.. భయంతో పరుగులు పెట్టిన సెక్స్‌బాంబ్
Recommended Video

సెక్స్‌బాంబ్ సన్నీలియోన్‌పై పాము దాడి జరిగింది. పాముతో దాడి చేసింది ఎవరో కాదు. యూనిట్ సభ్యులే. పాము దాడితో భయకంపితులైన సన్నీ పెద్దగా అరుస్తూ సెట్స్‌లో పరుగులు పెట్టింది. ఇదంతా నిజంగా పాము దాడి కాదండోయ్.. సెట్స్‌లో సన్నీని ఆటపట్టించడానికి యూనిట్ సభ్యులు చేసిన తమాషా (ప్రాంక్) ఆట ఇది. అసలేం జరిగిందంటే..

స్రిప్టు చదువుతుండగా..
ఓ సినిమా షూటింగ్‌లో సన్నీలియోన్ చైర్‌లో కూర్చొని స్క్రిప్టు చదువుకునే పనిలో నిమగ్నమైంది. అంతలోనే ఒకతను రబ్బరు పామును తెచ్చి సన్నిలియోన్‌పై పడేశాడు. దాంతో భయంతో అరుస్తూ పరుగులు పెట్టింది.

ఇన్స్‌టాగ్రామ్‌లో సన్నీ వీడియో
సన్నిలియోన్ పరుగులు పెట్టిన తతంగాన్ని అంతా వీడియోగా షూట్ చేసి సన్నిలియోన్‌ను ఆటపట్టించారు. ఈ తర్వాత వీడియోను సన్నీ ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
వైరల్‌గా సన్నీ వీడియో
తన అకౌంట్‌లో పోస్ట్ చేసిన వీడియోకు 5 గంటల వ్యవధిలోనే దాదాపు పది లక్షల వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం 2.5 మిలియన్ల వ్యూస్, 6454 కామెంట్స్ రావడం గమనార్హం.

ఈ రేంజ్‌లో రెస్పాన్సా?
పాముతో ప్రాంక్ వీడియో వైరల్‌గా మారడంపై సన్నీలియోన్ స్పందించింది. చాలా వేగంగా 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇన్స్‌టాగ్రామ్‌లో నేనేప్పుడు ఇలా చూడలేదు. ఫ్రాంక్ వీడియోలను చూడటానికి ఇంత ఇష్టపడుతారని ఊహించలేదు. నన్ను ఆటపట్టించిన యోఫ్రాంకి (@yofrankay)పై కక్ష తీర్చుకొంటాను. ఆ వీడియో మరింత ఫన్నీగా ఉంటుందని మీరు భావించవచ్చు.

గరుడవేగ చిత్రంలో ఐటెం సాంగ్
రాజశేఖర్ నటించిన గరుడవేగ చిత్రంలో ఓ ఐటెం సాంగ్‌లో నటించిన సన్నీలియోన్‌కు మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం అర్బాజ్ ఖాన్‌తో కలిసి తెరా ఇంతెజార్ అనే చిత్రంలో నటిస్తున్నది.


Click it and Unblock the Notifications











