సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో మొదటి స్థానం ఆమెదే
కొలాబా: నీలి చిత్రాల తార సన్నీ లియోన్ ఇప్పుడు బాలీవుడ్‌లో పాగా వేసింది. నటించింది కేవలం రెండు చిత్రాల్లోనే అయినా స్టార్స్ కి చెక్ పెడుతూ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. అదెలా అనుకుంటున్నారా.. ఆమె నటన చూసి కాదు.. సామాజిక సైట్లలో ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది. జిస్మ్-2 చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన ఈ భామ ఓ చిత్రంలో ప్రత్యేక గీతంతో గుర్తింపు తెచ్చుకుంది.
గూగుల్, యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి పలు వెబ్‌సైట్ల తాజా ర్యాంకింగ్‌లో అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ పేర్లు కనుమరుగయ్యాయి. ఇప్పుడు యువత మొత్తం సన్నీ లియోన్ పేరునే జపిస్తోంది. మొదటి పది స్థానాల్లో నటీనటులు వీరే.. సన్నీలియోన్, కత్రినా కైఫ్, కరీనా కపూర్, సల్మాన్ ఖాన్, ఐశ్వర్యరాయ్, అక్షయ్ కుమార్, దీపికా పదుకొనె, రణబీర్ కపూర్, అమీర్ ఖాన్, అనుష్క శర్మ.
మరో ప్రక్క అంతర్జాలంలో మూడు కోట్ల మంది అభిమానులతో సన్నిలియోన్ దూసుకుపోతున్నారు. బాలీవుడ్ తారలు సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్‌లను వెనక్కి నెట్టి తన హవా కొనసాగిస్తోంది.ఐశ్వర్యరాయ్, బెబో(కరీనా కపూర్)లు.. సన్నిలియోన్ కంటే వెనకబడ్డారు. బాలీవుడ్‌లోకి అడుగిడిన తర్వాత ఈ నీలి చిత్రాల భామ ఒక్కసారిగా ఎదిగిపోయింది. గత కొద్ది రోజుల క్రితం మన దేశంలో అందరి కంటే గొప్ప సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా సన్నిలియోన్ ప్రపంచంలోనే అత్యధిక మంది అభిమానుల కలిగిన బాలీవుడ్ సెలబ్రిటీగా వెలుగుతున్నారు. ఈ విషయంలో ఆమె బాలీవుడ్‌లో టాప్‌స్టార్‌గా వెలుగొందిన కత్రినా కైఫ్‌ను అధికమించటం విశేషం. గూగుల్, యూట్యూబ్ వంటి పాపులర్ వెబ్‌సైట్ల గణాంకాల ప్రకారం.. డిసెంబరు 2012 నాటికి సన్నిలియోన్‌కు అంతర్జాలంలో 3.05 కోట్ల మంది అభిమానులున్నారు. ఇంత మంది ఆమె ఖాతాలను శోధించారు. అదే సమయంలో కత్రినాకు అంతర్జాలంలో 1.06 కోట్ల మంది అభిమానులున్నారు.


Click it and Unblock the Notifications












