»   » పాప కోసం సన్నీ చేసింది అంతపాపమా?, సన్నీ లియోన్ అసలు తప్పేం చేసిందీ?

పాప కోసం సన్నీ చేసింది అంతపాపమా?, సన్నీ లియోన్ అసలు తప్పేం చేసిందీ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

సన్నీ ఒకప్పుడు పోర్న్ స్టార్... అలా తాను ఒక శృంగార తారగా మారటానికి దారితీసిన పరిస్థితులను చెప్పుకొనీ, తనకున్న సమస్యలు తీరిపోయాక బాలీవుడ్ లోకి వచ్చి ఇప్పుడు ఆ పాత జీవితానికి స్వస్తి చెప్పేసింది కూడా. ఇప్పుడు బాలీవుడ్ లో ఆమె చేస్తున్నవి కొంత శృంగార పాత్రలే అయినా కొత్తగా సన్నీ వల్ల బాలీవుడ్ చెడి పోయిందేమీ లేదు ఆమెకంటే ముందే మల్లికా శరావత్, రాఖీ సావంత్ లాంటి నటీమణులు బాలీవుడ్ ని సుభిక్షంగానే ఉంచారు. కానీ సన్నీ ని మాత్రం ఆ పాత గతం వెంటాడుతూనే ఉంది. అదీ ఎంతగా అంటే ఇప్పుడామె మంచి పనే చేసినా కూడా ఆమెను జనం మాత్రం ఒక పోర్న్ స్టార్ గానే చూస్తున్నారు...

ఇంతకీ సన్నీ మీద జనం అంతగా ఎందుకు విరుచుకు పడుతున్నారూ అంటే సన్నీ ఒక అనాద పిల్లని దత్తత తీసుకుంది. ఆమెకు ఇప్పటికీ పిలలు పుట్టే అవకాశం ఉన్నా... మరెందుకో సొంత పిల్లలని వద్దనుకున్న సన్నీ దంపతులు ఒక భారతీయ బాలికను దత్తత తీసుకున్నారు. అయితే ఈ విషయాన్ని కూడా బయటకి తెలియకుండా సీక్రేట్ గానే ఉంచారు. అయితే ఈ మధ్య షెర్లిన్ చోప్రా వల్ల ఈ విషయం కాస్తా నెట్లోకి చేఇంది. ఈ ఫొటోని చూసిన బాలీవుడ్ జనం సన్నీ ని పొగుడుతూంటే మిగతా జనం మాత్రం ఆమెని తిట్టటం మొదలు పెట్టారు...

Sunny Leone being trolled for adopting a child is shameful
Sunny Leone Has Escape a Fatal Plane Crash - Filmibeat Telugu

సన్నీ లాంటి పోర్న్ స్టార్ ఒక చిన్నారిని దత్తత తీసుకుంటే ప్రభుత్వం ఎలా ఒప్పుకుంది? చిన్నారిని కూడా పోర్న్ స్టార్ గా మారుస్తుందా? అంటూ నోటికి వచ్చినట్లుగా తిట్టి పోస్తున్నారు. సన్నీ గతంలో పోర్న్ స్టార్ అన్నది నిజం. కానీ.. ఇప్పుడు మాత్రం కాదు. ఒక వ్యక్తి సమాజం ఏ మాత్రం ఒప్పుకోలేని వృత్తిని స్వీకరించి.. ఆ తర్వాత బయటకు వస్తే.. మిగిలిన వారి మాదిరి బతకకూడదా? సన్నీ నిజంగానే తప్పు చేసిందా? అంటే లేదనే చెప్పాలి.

Sunny Leone being trolled for adopting a child is shameful

ఒక చిన్నారికి చక్కటి జీవితాన్ని ఇచ్చిన దానికి మురిసిపోకుండా.. ఇలా తిట్టిపోయటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. కానీ సన్నీ ఇప్పుడు పోర్న్ స్టార్ కాదు, ఆ పాత జీవితాన్ని వదిలేసి రంగు, ప్రాంత తేడాలు లేకుండా (సన్నీ మూలాలు భారత్ లోనే అయినా ఆమె ఇక్కడ పుట్టి పెరగలేదు) ఇక్కడ పాపను దత్తత తీసుకోవటం ఇప్పుడు తప్పుకాక పోయినా ఇలా మాటలు మాత్రం పడుతూనే ఉంది....

English summary
Bollywood actress Sunny Leone and her husband have adopted a beautiful baby girl from Latur. But internet, being a funny place, found a reason to slut-shame Sunny on the same.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu