»   » మంచు మనోజ్ కు కంగ్రాట్స్ చెప్పిన సన్నిలియోన్

మంచు మనోజ్ కు కంగ్రాట్స్ చెప్పిన సన్నిలియోన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మంచు మనోజ్ నటించిన ‘కరెంట్ తీగ'చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఫోర్న్ స్టార్ సన్నిలియోన్. ఆమె రీసెంట్ గా మంచు మనోజ్ కు ట్వీట్ ద్వారా కంగ్రాట్స్ చెప్పింది. దేనికీ అంటే మంచు మనోజ్ ఎంగేజ్ మెంట్ విషయం తెలిసి. ఆమె మంచు మనోజ్, ప్రణీతా రెడ్డి కుటుంబాల ఇద్దరికీ శుభాకాంక్షలు తెలియచేసింది. ఇది చూసిన మనోజ్ ఆనందంతో ఆమెకు రీ ట్వీట్ చేసాడు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
సన్నిలియోన్ ట్వీట్ ఏమిటంటే..." మీ ఇద్దరికీ, మీ కుటుంబాలకి కంగ్రాట్స్..నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను !!" అని ట్వీట్ చేసింది.

ఇక మంచు మనోజ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో ఊహాగానాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మనోజ్ వివాహం గురించిన సమాచారాన్ని మోహన్ బాబు మీడియాకు తెలిపారు . తన పెద్దకోడలు విరానికా మిత్రురాలైన ప్రణతిని మనోజ్ త్వరలో వివాహమాడబోతున్నారని ఆయన తెలిపారు.

Sunny Leone congratulates Manchu Manoj

మోహన్ బాబు మాట్లాడుతూ...

''గత 40 ఏళ్లుగా నన్నూ, నా కుటుంబాన్ని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులు, అభిమానులకూ హృదయపూర్వక నమస్కారాలు. ఈ మధ్య కొన్ని ఛానెల్స్ లోనూ, కొన్ని పత్రికల్లోనూ మనోజ్ కుమార్ వివాహ విషయమై వార్తలు వచ్చాయి. ఆ వార్తలకు సంభందించి, స్పష్టమైన సమాచారం ఇవ్వడం నా భాధ్యత. నాక్కాబోయే కోడలి పేరు ప్రణతి '' అని మోహన్‌బాబు అన్నారు.

ఇంకా చెబుతూ - ''మా పెద్ద కోడలు విరానికా, ప్రణతి క్లాస్‌మేట్స్. ఆ విధంగా ప్రణతి తల్లిదండ్రులు సత్యనారాయణ, ప్రవీణలతో పరిచయం అయ్యింది. రెండు రోజుల క్రితం మనోజ్,ప్రణతిల పెళ్లి గురించి మాట్లాడుకున్నాం. ఓ శుభముహూర్తాన నిశ్చయ తాంబూలం, అనంతరం పెళ్లి జరుపుతాం. నాక్కాబోయే కోడలు ప్రణతి బిట్స్ పిలానీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివింది. న్యూయార్క్‌లో సీపీఏ(అమెరికాలో ఛార్టెడ్ ఎక్కౌంట్ ని సీపీఎ అంటారు) చేసింది. మీ అందరి ఆశీస్సులతో వివాహం జరుగుతుంది '' అని మోహన్‌బాబు పేర్కొన్నారు.

మనోజ్ కెరీర్ విషయానికి వస్తే...

మంచు మోహన్ బాబు, విష్ణులతో పని చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, త్వరలో మంచు మనోజ్ ను డైరెక్ట్ చేయడానికి రెడీ అయ్యారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం. ప్రతి సినిమాను అతి తక్కువ రోజుల్లో పూర్తి చేసే వర్మ, మనోజ్ సినిమాను ఒక నెల రోజుల్లో ఫినిష్ చేయాలని భావిస్తున్నారట.

మనోజ్, వర్మలు ప్రస్తుతం స్క్రిప్ట్ కు ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో బిజీగా ఉన్నారు. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్న వార్త నిజమే అని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ‘కరెంట్ తీగ' తర్వాత మంచు మనోజ్ నటిస్తున్న సినిమా ఇది.

English summary
Sunny congratulated Manoj after hearing about his engagement. Here is Sunny Leone's tweet." congrats to you both and your families!! I pray you are always happy!!”
Please Wait while comments are loading...