ఆ హాట్ సీన్ నాది: సన్నీ లియోన్‌పై ప్లేబాయ్ గర్ల్ వీరంగం
ముంబై: పోర్న్ సినిమాలు వదిలేసి సాధారణ సినిమాలు చేస్తూ నటిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది సన్నీ లియోన్. జిస్మ్ 2 చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ప్రస్తుతం రాగిణి ఎంఎంఎస్ 2 చిత్రంలో నటిస్తోంది. త్వరలో ఈ చిత్రం విడుదల కాబోతోంది. రాగిణి ఎంఎంఎస్ 2 చిత్రానికి సంబంధించిన బాబీడాల్ వీడియో ఇపుడు వివాదాస్పదం అయింది.
ఈ వీడియోలోని కొన్ని హాట్ సీన్లు నావే అని, నా కాన్సెప్టును కాపీ కొట్టి తీసారంటూ....ప్లేబాయ్ గర్ల్ శాంతి డైనమైట్ ఆరోపిస్తోంది. శాంతి డైనమైట్ ఇండియన్-గ్రీకు సంతతికి చెందిన భామ. ప్లేబాయ్ మేగజైన్ కోసం న్యూడు ఫోజులు ఇచ్చిన తొలి ఇండియన్‌గా ఆమె రికార్డుల కెక్కింది. పలు అడల్ట్ చిత్రాల్లోనూ నటించింది.

శాంతి డైనమైట్ మాట్లాడుతూ 'సన్నీ లియోన్ 'బాబీడాల్' సాంగులో నా కాన్సెప్టును కాపీ కొట్టారని చాలా మంది చెప్పారు. అది చూసిన తర్వాత నేను కూడా షాకయ్యాను. ఇలా చేయడం నన్ను చాలా అప్ సెట్ చేసింది. ఇంకొకరి కాన్సెప్టును కాపీ కొట్టడం సరైన చర్య కాదు' అని సన్నీ లియోన్ చెప్పకొచ్చారు.
సన్నీ లియోన్ మాదిరి శాంతి డైనమైట్ కూడా బాలీవుడ్లో అవకాశాలు దక్కించుకోవాలని ఆశ పడుతోంది. పోర్న్ స్టార్ అయిన సన్నీ లియోన్‌కు ఆదరణ లభించిన నేపథ్యంలో అలాంటి బ్యాగ్రౌండే కలిగిన తనకు కూడా ఆదరణ లభిస్తుందని శాంతి డైనమైట్ భావిస్తోంది. ఓ బాలీవుడ్ మూవీలో ఆమెకు ఐటం సాంగు చేసే అవకాశం దక్కినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











