»   » సన్నీ లియోన్ ‘వాలంటైన్స్ డే’ ప్లాన్ ఇదే..

సన్నీ లియోన్ ‘వాలంటైన్స్ డే’ ప్లాన్ ఇదే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్ ఈ వాలంటైన్స్ డేను తన భర్త డేనియల్ వెబర్ తో కలిసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంది. వాలంటైన్స్ డే సందర్భంగా ఈ ఇద్దరూ ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వెళ్లారు. అక్కడే ఎంజాయ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. డేనియల్ వెబర్ తమ వాలంటైన్స్ డే ప్లాన్ గురించి బాలీవుడ్ మీడియాకు వెల్లడించారు.

‘ప్రతి సంవత్సరం జరుపుకున్నట్లే ఈ సంవత్సరం కూడా వాలంటైన్స్ డేను స్పెషల్ గా జరుపుకునేందుకు ప్లాన్ చేసుకున్నాం. నేను సన్నీ కోసం మంచి గిఫ్ట్ తీసుకుంటాను. ఇలాంటి సందర్భాల్లో సన్నీ లియోన్ సరికొత్త అనుభూతి పొందాలని సన్నీ కోరుకుంటుంది. పుట్టినరోజు లాంటి సందర్భంగా కూడా సన్నీ ఇలానే చేస్తుంది. ఎక్కువగా అడ్వంచర్స్ ఇష్టపడుతుంది' అన్నారు.

Sunny Leone

తెరపై సెక్సీగా కనిపించే సన్నీ లియోన్ సాహసోపేతమైన పనులు చేయడానికి ఎక్కువగా మక్కువ చూపుతుందనే విషయం చాలా మందికి తెలియదు. దీని గురించి డేనియర్ వెబర్ వివరిస్తూ..‘నాతో కలిసి విభిన్నంగా ఎంజాయ్ చేయాలని సన్నీ కోరుకుంటుంది. ఒకసారి రేస్ కార్ ట్రిప్ వేసాం, ఓసారి విమానంలో నుండి పారాచూట్ తో జంప్ చేసాం, ఒకసారి బ్యూటిఫుల్ డిన్నర్ చేసాం, ఈ సారి సన్నీ లియోన్ ఏం చేస్తుందో నాకు తెలియదు కానీ...నేను మాత్రం ఆమెకు మంచి గిఫ్ట్ తీసుకెళతాను, సన్నీ ఈ సారి కూడా డిపరెంటుగా ఏదో ఒకటి చేస్తుంది' అన్నారు.

ప్రస్తుతం సన్నీ లియోన్ బాలీవుడ్ కెరీర్ కూడా మంచి ఊపుమీద ఉంది. ఆమె నటించిన మస్తీ జాదె ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. వరుస ప్రాజెక్టులతో సన్నీ లియోన్ రెండు చేతులా సంపాదిస్తోంది. ఎప్పుడూ షూటింగులతో బిజీగా ఉండే ఆమె...ఇలా వాలంటైన్స్ డే లాంటి అకేషన్స్ లో బాగా ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతుంది.

English summary
Sunny Leone and Daniel Weber, are currently in the city of falling angels, Los Angeles and would spend their Valentine's Day together. Daniel Weber, has just revealed his Valentine's Day plans with Sunny and it's superhot.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu