అనుష్కను మించిపోయిన సన్నీలియోన్.. సెక్సీబాంబ్‌కు అంత సీనుందా?
News
oi-Rajababu
By Rajababu
|
అనుష్కను మించిపోయిన సన్నీ రేట్..!
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని చెబుతారు పెద్దలు. ప్రస్తుతం ఈ సామెతను పక్కాగా అమలు చేస్తున్నది సెక్స్ బాంబ్ సన్నీలియోన్. ఓ సినిమాలో నటించమని దక్షిణాదికి చెందిన ఓ నిర్మాత సంప్రదించగా సన్నీ చెప్పిన రెమ్యునరేషన్ విని కంగుతిన్నాడట. అంతేకాదు సన్నీ అడిగిన మొత్తం అనుష్క రెమ్యునరేషన్ కంటే ఎక్కువ అనే తెలిసింది. ఇంతకీ సన్నీ అడిగిన మొత్తం ఎంత అంటే..
గరుడవేగలో మెరిసిన సన్నీ
ఆ మధ్య కరెంట్ తీగ చిత్రంలో కనిపించిన సన్నీలియోన్.. తాజాగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన గరుడ వేగలో మెరిసింది. ఆమె చేసిన ఐటెమ్ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దక్షిణాదిలో ఆమెకు ఉన్న పాపులారిటీని దృష్టిలో ఉంటుకొని ఓ నిర్మాత సంప్రదించారట.
భారీగా రెమ్యునరేషన్ డిమాండ్
అయితే దక్షిణాది చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పిన సన్నీలియోన్ భారీ రెమ్యునరేషన్‌ను అడిగిందట. ఆ మొత్తం బాహుబలి రెండు భాగాల్లో నటించినందుకు అనుష్క శెట్టికి ఇచ్చిన మొత్తం కంటే ఎక్కువ అట. దాంతో సదరు నిర్మాత ఆ మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధమయ్యారట.
పారితోషికం ఎంతంటే..
తాజా సమాచారం ప్రకారం.. సన్నీలియోన్ రూ2.5 కోట్లతోపాటు అందుకయ్యే ట్యాక్స్, ఇతర మొత్తాలను కూడా అడిగిందట. ఆ డిమాండ్ చేసిన మొత్తం ఎంతకు చేరిందంటే.. సుమారు రూ.3.25 కోట్లు అని తెలిసింది.
అనుష్కకు ముట్టిన మొత్తం
ప్రపంచవ్యాప్తంగా భారీ సక్సెస్ అందుకొన్న బాహుబలి రెండు భాగాల్లో నటించినందుకు అనుష్కకు ముట్టింది రూ.2.5 కోట్లు. అంటే దాదాపు మూడు, నాలుగు సంవత్సరాలు కష్టపడితే గానీ అనుష్కకు ఈ మొత్తం ముట్టలేదట.
నాలుగు భాషల్లో సెక్స్‌బాంబ్
సన్నీలియోన్ భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం కరెక్టే అనే మాట వినిపిస్తున్నది. ఎందుకంటే ఆమె నటించే చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కనున్నదట. అందుకే నిర్మాత సన్నీలియోన్ అడిగిన మొత్తాన్ని ఇచ్చేందుకు సిద్ధమయ్యారట.
యుద్ధనారి కథా నేపథ్యంగా
ఓ యుద్ధనారి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనున్నది. ఈ చిత్రం పేరును వెల్లడించడానికి సదరు నిర్మాత నిరాకరించారు. అయితే ఈ చిత్రం 2018 ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లనున్నదని తెలిసింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు అధికారికంగా ప్రకటిస్తామని నిర్మాత చెప్పారు.
Sunny Leone demanded a rather exorbitant fee for her upcoming South Indian film. The remuneration was more than what Anushka Shetty received for the Baahubali films. Sunny's film will be made in four languages, Telugu, Tamil, Malayalam, and Hindi. The producer strongly believes that the amount can be recovered, as Sunny has a solid fan-base in South India. The film is based on a real-life warrior princess expected to go on floors in February, 2018.
Story first published: Monday, December 18, 2017, 16:59 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more