సన్నీ లియోన్, "డియో..! డియో..!! డిసక డిసక" : పీఎస్వీ గరుడవేగ ఐటం సాంగ్ విడుదల (వీడియో)
గరుడ వేగ లో చేసిన "డియో..! డియో..!!' అనే ఐటం సాంగ్ దుమ్మురేపేలాగానే కనిపిస్తోంది... ఆ సాంగ్ లిరికల్ వీడియోను చిత్ర యూనిట్ యూట్యూబ్ లో రిలీజ్ చేసింది.
సన్నీ లియోన్ ఇండియన్ సినిమాకి అద్దిన సృంగారపు మెరుపు. ఒకప్పుదు తాను చేసిన పోర్న్ స్టార్ ముద్రని పోగొట్టుకోవటానికి చాలాకాలమే పట్టింది. బాలీవుడ్ లోనే ఆమెని ఒక నటిగా అంగీకరించటానికి చాలాకాలమే పట్టింది. అలాంటిది దక్షిణాదిలో కనిపించటం అంటే మాటలా? అయితే నెమ్మది నెమ్మదిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది సన్నీ.

లైలా మై లైలా
తనమీద ఉన్న ఆ పోర్న్ ట్యాగ్ ని వదిలించుకుని ఇప్పుడు మామూలు ఐటం భామగా టాలీవుడ్ లోనూ కనిపించినా జనం మామూలుగానే రిసీవ్ చేసుకుంటున్నారు. ‘కరెంటు తీగ'లో చేసినప్పటికీ సన్నీ ని తెలుగు జనం అంతగా పట్టించుకోలేదు. అయితే గత సంవత్సరం బాలీవుడ్ లో వచ్చిన "రయీజ్" లో లైలా మై లైలా అంటూ సన్నీ తిప్పిన నడుముని చూసి అబ్బా..! చాలా మిస్సయ్యాం సన్నీ అనుకున్నారు.

డియో డియో డిసక డిసక
ఇప్పుడు మాత్రం గరుడ వేగ లో చేసిన "డియో..! డియో..!!' అనే ఐటం సాంగ్ దుమ్మురేపేలాగానే కనిపిస్తోంది... ఆ సాంగ్ లిరికల్ వీడియోను చిత్ర యూనిట్ యూట్యూబ్ లో రిలీజ్ చేసింది. పాట అనుకున్నట్టుగానే ఫుల్ హాట్ గా ఉంది. భాస్కరభట్ల లిరిక్స్ ను చాలా స్పైసి గా రాసాడని అర్ధమవుతోంది. సినిమాలో సన్నీ ప్రతి అందానికి ఒక రేటు అనేలా ఆ సాంగ్ ఉంది. అంతే కాకుండా ఆమె ప్రతి అందాన్ని పొగిడినట్లు ఉంది.

సన్నీ ఇచ్చిన ఎక్స్ప్రెషన్లకి
ఇక ఆమె క్రేజ్ గురించి కూడా మంచి లైన్స్ ఉన్నాయి. సన్నీ కోసం ఫ్యాన్స్ ఎలా ఎగబాడతారో తెలిసిన విషయమే. ఆ తరహాలోనే పాట సాగుతున్నట్లు ఉంటుంది. అంతే కాదు ఇక మామూలుగా చూస్తేనే పిచ్చెక్కిపోయే జనాలకి ఈ పాటలో సన్నీ ఇచ్చిన ఎక్స్ప్రెషన్లకి మతిపోవటం ఖాయమట.
గీతామాధురి
మొత్తానికి పాట విన్నవారు డియో డియో డిసక డిసక అనడం ఖాయంగా కనిపిస్తోంది. భీమ్స్ ఈ పాటకి మంచి బాణీలను అందించాడు. ఇక గీతామాధురి మరో సారి తన గాత్రంతో వారెవ్వా.. అనిపించేలా చేసింది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఎందుకంటే లిరికల్ విడియాలో సన్నీ మూమెంట్స్ కూడా ఉన్నాయి మరి.


Click it and Unblock the Notifications











