ఐటమ్‌ సాంగ్‌ చేస్తున్న సన్నీ లియోన్‌

By Srikanya

ముంబై: ఫోర్న్ స్టార్ సన్నీలియోన్‌ బాలీవుడ్‌లో మరో చిత్రం ఒప్పుకుంది. షూటౌట్‌ ఎట్‌ వదాలా అనే సినిమాలో ఐటమ్‌ సాంగ్‌ చేయబోతోంది. బబ్లీ బద్మాష్‌ హై అంటూ సాగే ఈ పాటకు ప్రముఖ నృత్య దర్శకుడు అహ్మద్‌ఖాన్‌ కోరియోగ్రఫీ చేస్తారు. ఈ సినిమాకు ఈ పాటే హైలెట్ గా ఉంటుందని చెప్తున్నారు.

ఈ పాట మాస్‌ టైపులో ఉండటంతో హీరోయిన్ పాత్ర పోషిస్తున్న ప్రియాంకచోప్రా నిరాకరించారు. దీంతో దర్శకనిర్మాతలు సన్నీ లియోన్‌ను సంప్రదించారు. ఆమె ఈ పాటలో పూర్తిగా దేశీయ వస్త్రధారణలోనే కనిపించనుంది. ఒక చిన్న చోళీని, చిన్న గాగ్రాను ధరిస్తుందని దర్శకుడు సంజయ్‌గుప్తా చెప్పారు. ఈ పాట ఈ సంవత్సరానికే టాప్‌గా నిలుస్తుందని నిర్మాత ఏక్తా కపూర్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరో ప్రక్క అంతర్జాలంలో మూడు కోట్ల మంది అభిమానులతో సన్నిలియోన్‌ దూసుకుపోతున్నారు. బాలీవుడ్‌ తారలు సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌లను వెనక్కి నెట్టి తన హవా కొనసాగిస్తోంది. ఐశ్వర్యరాయ్‌, బెబో(కరీనా కపూర్‌)లు.. సన్నిలియోన్‌ కంటే వెనకబడ్డారు. బాలీవుడ్‌లోకి అడుగిడిన తర్వాత ఈ నీలి చిత్రాల భామ ఒక్కసారిగా ఎదిగిపోయింది. గత కొద్ది రోజుల క్రితం మన దేశంలో అందరి కంటే గొప్ప సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా సన్నిలియోన్‌ ప్రపంచంలోనే అత్యధిక మంది అభిమానుల కలిగిన బాలీవుడ్‌ సెలబ్రిటీగా వెలుగుతున్నారు. ఈ విషయంలో ఆమె బాలీవుడ్‌లో టాప్‌స్టార్‌గా వెలుగొందిన కత్రినా కైఫ్‌ను అధికమించటం విశేషం.

గూగుల్‌, యూట్యూబ్‌ వంటి పాపులర్‌ వెబ్‌సైట్ల గణాంకాల ప్రకారం.. డిసెంబరు 2012 నాటికి సన్నిలియోన్‌కు అంతర్జాలంలో 3.05 కోట్ల మంది అభిమానులున్నారు. ఇంత మంది ఆమె ఖాతాలను శోధించారు. అదే సమయంలో కత్రినాకు అంతర్జాలంలో 1.06 కోట్ల మంది అభిమానులున్నారు. నేటి బాలీవుడ్‌ ప్రపంచంలో బాక్సాఫీసును బద్దలు కొట్టే పాపులర్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ ఆన్‌లైన్‌ సెర్చ్‌లో టాప్‌5 సెలబ్రిటీల్లో స్థానం సంపాదించుకున్నారు. బాలీవుడ్‌ నుంచి స్థానం పొందిన ఏకైక కథానాయకుడు కావటం విశేషం. కోటి మంది ఆయన వివరాల కోసం అంతర్జాలంలో శోధించారు.

సల్మాన్‌ ఖాన్‌ టాప్‌5 జాబితాలో నాలుగో స్థానంలో ఉండగా.. ప్రస్తుతం చిత్రీకరణలకు దూరంగా ఉన్న ఐశ్వర్యారాయ్‌ మూడో స్థానం పొందడంతో ఆమె డిమాండ్‌ మరింత పెరిగింది. ఐష్‌ వివరాల కోసం 1.01 కోట్ల మంది శోధించారు. సైఫ్‌అలీ ఖాన్‌ను వివాహం చేసుకున్న తర్వాత కూడా బెబో డిమాండ్‌ ఏ మాత్రం తగ్గలేదు. ఆమె వివరాల కోసం 87 లక్షల మంది అంతర్జాలంలో శోధించారు. దీంతో ఆమె ఐదో స్థానంలో నిలిచారు. ఆన్‌లైన్‌ టాప్‌5 జాబితా... సన్నిలియోన్‌ 3.05 కోట్ల మంది అభిమానులు ఉండగా.. కత్రినాకు 1.06 కోట్లు, ఐశ్వర్యారాయ్‌ 1.01 కోట్లు, సల్మాన్‌ ఖాన్‌కు కోటి, కరీనా కపూర్‌ 87 లక్షల మంది అభిమానులు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X