»   » రజనీకాంత్‌పై కన్నేసిన ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్

రజనీకాంత్‌పై కన్నేసిన ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగులూరు: ఫోర్న్ స్టార్ నుంచి బాలీవుడ్ స్టార్‌గా మారిన సన్నీ లియోన్ గురించి కొత్త గా పరిచయం అక్కర్లేదనుకుంటా. ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలో క్రమక్రమంగా తన అందాలను విస్తరింప చేస్తున్న సన్నీ....ఇప్పటికే పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారింది. ఇటీవల బెంగుళూరు వచ్చిన సన్నీ చూపులు సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్‌పై కూడా పడ్డాయి.

బెంగులూరులో ఆమె మాట్లాడుతూ...'ఎయిర్ పోర్టు నుంచి హోటల్‌కు వస్తూ సిటీ చూసాను. చాలా బాగుంది. వీధులు చాలా శుభ్రంగా ఉన్నాయి. సౌత్‌లో స్టార్స్ అంతా చాలా క్రమ శిక్షణగా ఉంటారని, సమయానికి షూటింగులకు చేరుకుంటారని విన్నాను. ఇప్పటికే నేను తమిళ యాక్టర్ భరత్‌తో కలిసి హిందీ మూవీ 'జాక్ పాట్' చిత్రంలో నటించాను. అతని ఆటిట్యూడ్, పని తీరు చాలా నచ్చింది. అతని కామిక్ సెన్స్ నచ్చింది ఎంతో ఫన్నీగా ఉంటాడు' అని వెల్లడించింది.

'సౌత్ టాప్ స్టార్ రజనీకాంత్ గురించి కూడా విన్నాను. అతను సినిమాల్లో సిగరెట్ స్టైలిష్‌గా కాలుస్తారట. రజనీకాంత్ లాంటి స్టార్లతో నటించాలని ఉంది. బాలీవుడ్లో అమీర్ ఖాన్ లాంటి వాళ్లతో నటించే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. ప్రేక్షకులను ఎంటర్టెన్ చేసే సినిమాల్లో నటించాలనేదే నా కోరిక' అని చెప్పుకొచ్చింది సన్నీ లియోన్.

ప్రస్తుతం సన్నీ లియోన్ మూడు హిందీ చిత్రాల్లో నటిస్తోంది. రాగిణి ఎంఎంఎస్ 2 చిత్రంతో పాటు జాక్ పాట్, టినా అండ్ లోలో అనే చిత్రాల్లోనూ నటిస్తోంది. ఫోర్న్ చిత్రాల్లో నటించిన అనుభవం ఉండటంతో ఆమె అందాలను తమ సినిమాల్లో చూపెట్టేందుకు పలువురు దర్శకులు ఆసక్తి చూపుతున్నారు.

English summary
"I definitely want to work with everyone who'd want to work with me. But Aamir Khan tops my wish list. He is a really good actor and I am impressed with his body of work. I'd also like to work with Rajinikanth," says Sunny.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu