సెక్స్ చిత్రాల తార కాబట్టే ఆమెకు ఆ కష్టాలు..!
ఈ మేరకు ముంబైలోనే కొంత కాలం భర్తతో కలిసి మకాం వేయాలనే ఉద్దేశ్యంతో అద్దె ఇంటి కోసం వెతుకుతున్న ఆమెకు నిరాశే ఎదురవుతోంది. సన్నీ లియోన్ ఫోర్న్ స్టార్ కావడంతో ఆమెకు ఇల్లు అద్దెకు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో చేసేది లేక భర్తతో కలిసి హోటల్‌లోనే ఉంటుంది. సన్నీ లియోన్‌కు ఇల్లు అద్దెకు ఇస్తే తమ కొంపను ఇకపై ఎవరూ సంసారుల కొంపగా చూడరని ముంబైలోని ఇంటి ఓనర్లు భయ పడుతున్నారట.
ఆ సంగతి పక్కన పెడితే... సన్నీ లియోన్ నటించిన తొలి చిత్రం జిస్మ్ 2 బాక్సాఫీసు వద్ద ఫెయిల్యూర్ కావటంతో తన రేటుని అమాంతం తగ్గించేసింది. ప్రస్తుతం ఆమె ఏక్తా కపూర్ చిత్రానికి కేవలం కోటి రూపాయల రెమ్యునేషన్ కే ఓకే చేసినట్లు సమాచారం. రాగిణి ఎమ్.ఎమ్.ఎస్ సీక్వెల్ లో హీరోయిన్ గా సన్ని లియోన్ ని తీసుకున్నట్లు తెలుస్తంది.
జిస్మ్ 2 సినిమా నెగెటివ్ టాక్ వచ్చినా ఈచిత్రంలో సన్నీ లియోన్ ఆరబోసిన అందాలకు కోట్ల వర్షం కురిసింది. అంటే కేవలం ప్రేక్షకులు సన్నీ లియోన్ నగ్న అందాలను చూడటానికే థియేటర్లకు వచ్చారన్నమాట. ఈ పాయింటును గ్రహించిన పలువురు టాలీవుడ్ నిర్మాతలు, దర్శకుడు సన్నీ లియోన్‌తో తెలుగులో ఓ సినిమా చేయించడానికి సన్నాహాలు చేస్తున్నారట. తెలుగులో రూపొందించి దక్షిణాదిన ఇతర బాషల్లో అనువాదం చేసుకుంటే బోలెడు డబ్బులు వస్తాయని భావిస్తున్నారు. ఈ మేరకు తమ తమ ప్రయత్నాల్లో ఉన్నారట.


Click it and Unblock the Notifications












