ఒక్క రాత్రికి సన్ని లియోన్ రేటు అంతా?
ముంబై: బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా పాపులర్ అయిన భామ సన్నీలియోన్ రీసెంట్ గా ఒక్క రాత్రికి కోటి రూపాయలు రేటు వసూలు చేస్తూ షాక్ ఇచ్చింది. డిసెంబర్ 31 రాత్రి ఓ స్టార్ హోటల్ లో డాన్స్ చేయటానికి ఆ ఎమౌంట్ ఆమె వసూలు చేస్తోంది. ఆమె మొదట ఈ ఆఫర్ ఒప్పుకోకపోయినా తర్వాత మిగతా బాలీవుడ్ పెద్ద పెద్ద హీరోయిన్స్ కూడా ఇదే బాటలో ప్రాయాణించటం చూసి ఓకే అంది. ఇంతకీ ఆమె ఇండియన్ తెరకు పరిచయం అయ్యి సంవత్సరం కూడా పూర్తి కాలేదు.
ఇంతకీ ఆ హోటల్ డిల్లీకి చెందినది. మొదట ఆ హోటల్ వారు ఆ రేటుకు ఒప్పుకోకపోయినా తర్వాత ఆమె డాన్స్ చేస్తోందంటే వచ్చే డిమాండ్ చూసి షాక్ అయ్యి ఓకే చేసేసారు. ఆమె ఓకే అనగానే ఆ రోజు రాత్రి కు పెట్టే టిక్కెట్ రేటు భారీగా పెంచేసినా జనాలు ఎగబడటంతో వారు సంతృప్తిగా ఉన్నారు. జిస్మ్ 2 లో అందాలు ఒలకపోసిన ఆమె డాన్స్ చేయటం తమ హోటల్ కి గర్వ కారణంగా భావిస్తూ ఓ రేంజిలో పబ్లిసిటీ చేస్తున్నారు.
ప్రస్తుతం మర్డర్ 3 చిత్రం కోసం రెడీ అవుతున్న ఈ భామ బాలీవుడ్ లో హాట్ ఫేవెరెట్ గా మారింది. సన్ని లియోన్ ఎన్ని కబుర్లు చెప్పినా ఆమె ఫోర్న్ స్టార్ ఇమేజ్ ఆమెను వదలటం లేదు. దాంతో ఆమెను తమ సినిమాల్లో చేయటానికి ఓ మాదిరి హీరోలు కూడా ఒప్పుకోవటం లేదు. సన్నిలియోన్ తో చేస్తే తమ సినిమాలకు ప్యామలీ ఇమేజ్ దెబ్బతింటుందని భావిస్తున్నారు. మహేష్ భట్ క్యాంప్, ఏక్తా కపూర్ తప్ప.. సన్నిలియోన్ తో చేసే ధైర్యం చేయటం లేదు. అయితే తాను బాలీవుడ్ లో సెటిల్ అవ్వటానికే వచ్చానని సన్ని చెప్పటం విశేషం.
'జిస్మ్-2' చిత్రంతో పరిచయమైన ఈ ఫోర్న్ స్టార్.. అందచందాల ప్రదర్శనతో బాలీవుడ్ వేడిక్కిపోయింది. నటనకన్నా ఆమె శరీరంపైనే కెమెరాల దృష్టి. అది గమనించిన ఈ ముద్దుగుమ్మ ఇలా తను కేవలం ఫోర్న్ స్టార్ ని కాదు భారతీయ సంస్కృతిలో కూడా కలిసిపోగలని చెప్తోంది. తానేమీ వ్యభిచారిని కాదని, ఫోర్న్ స్టార్ అంటే అర్దం వ్యభిచారం చేసే వాళ్లు కాదని సన్నిలియోన్ మీడియా వాపోతోంది. ఆమెను జనం తప్పు పడుతున్నారని, ఇక్కడు ఇండియాలో తనను సరిగా అర్దం చేసుకోకుండా మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆమె అంటోంది.


Click it and Unblock the Notifications












