శృంగార తార చుక్కలు చూపించిన వేళ! (ఫోటో)
ముంబై: ఫోర్న్ స్టార్ నుంచి బాలీవుడ్ స్టార్‌గా మారిన సన్నీ లియోన్....బాలీవుడ్లో అడుగు పెట్టడంతోనే హాట్ హాట్ పడక గది సీన్లతో, లిప్ లాక్ ముద్దు సీన్లతో, సెక్సీ అందాలతో ఆకట్టుకుంది. ఆమె గత నేపథ్యం, ఎంట్రీ అలా ఉంది కాబట్టి సినిమాకు వెళ్లే ఆమె అభిమానులు సాధారణంగా అలాంటి సీన్లే ఉంటాయని భావిస్తారు.
అయితే తన రాబోయే సినిమా 'టినా అండ్ లోలో' చిత్రంలో సన్నీ లియోన్ అందరి అంచనాలకు భిన్నంగా అదరిపోయే యాక్షన్ సీన్లు చేసి సినిమాలోని విలన్లకు చుక్కలు చూపించబోతోంది. తాజాగా ఆమెపై ఇటీవల ఓ ఫైట్ సీన్ చిత్రీకరించారు. అందుకు సంబంధించిన ఫోటోను ఇక్కడ చూడొచ్చు. బ్యాడ్ న్యూస్ ఏమిటంటే....ఇలాంటివి పెద్దగా అలవాటు లేని సన్నీ లియోన్ ఫైట్ సీన్ చిత్రీకరిస్తుండగా గాయపడింది.
అయితే పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదని, అదృష్ట వశాత్తు చిన్న పాటి గాయాలతోనే ఆమె ప్రమాదం నుంచి తప్పించుకుందని, వెంటనే వైద్యుడు అందుబాటులో ఉండటంతో వెంటనే చికిత్స నిర్వహించారని యూనిట్ సభ్యులు అంటున్నారు. 'టినా అండ్ లోలో' చిత్రానికి దేవాంగ్ ఢోలకియా దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రంలో సన్నీ లియోన్ మెయిన్ రోల్ చేస్తోంది. కరిష్మా తన్నా, మినిషా లాంబ ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈచిత్రం వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శృంగార తారను యాక్షన్ తారగా చూడటం అంటే అభిమానులకు కొత్త అనుభూతే అని చెప్పక తప్పదు.


Click it and Unblock the Notifications












