అపుడు శృంగారమే: సన్నీ లియోన్ చాలా మారింది!
హైదరాబాద్: ఒకప్పుడు సన్నీ లియోన్ పేరు వింటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది శృంగారమే. ఎందుకంటే ఆమె కెనయడిన్ పోర్న్ స్టార్ కాబట్టి. పెద్దలుక మాత్రమే పరిమితమైన లెక్కకు మిక్కిలి శృంగార చిత్రాల్లో నటించింది. ఆమె ఇండియాలో అడుగు పెట్టిన కొత్తలో విమర్శలే విమర్శలు. ఇలాంటి వారిని ఇండియన్ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టడం ఏమిటంటూ ఆందోళనలు కూడా జరిగాయి.
అయితే అన్నిటినీ భరించి....తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే రేంజికి ఎదిగింది. త్వరలో ఆమె ఇండియన్ సాంప్రదాయ నృత్యాలను కూడా వెండితెరపై ప్రదర్శించబోతోంది. సన్నీ లియోన్ త్రిపాత్రాభినయంలో నటిస్తున్న చిత్రం ‘లీలా'లో ఆమె క్లాసికల్ డాన్స్ చేయబోతోంది. ఇటీవలే ఓ క్లాసికల్ డ్యాన్స్ నంబర్ కూడా చిత్రీకరించారు.
ఈ పాట కోసం చాలా శ్రమించిది. సరోజ్ ఖాన్ వద్ద కొన్నాళ్లపాటు ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంది. క్లాసికల్ డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ నృత్యంలో శిక్షణ తీసుకోవాలని చాలా సార్లు అనుకున్నాను. కానీ సినిమాలతో బిజీగా ఉండటం వల్ల అందుకు వీలుపడలేదు. లీలా చిత్రంతో ఈ కోరిక తీరిందని చెప్పుకొచ్చింది.

బాబీ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకురానుంది. భూషణ్ కుమార్, అహ్మద్, షైరా ఖాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదైలంది. ప్రిన్సెస్ లుక్‌లో సన్నీ లియోన్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఈ చిత్రంలో మొత్తం 9 పాటలు ప్లాన్ చేసారు. తన గత సినిమాలతో పోలిస్తే ఈచిత్రంలో సన్నీ లియోన్ పూర్తిగా డిఫరెంట్‌గా కనిపించబోతోంది. లవ్ స్టోరీ నేపథ్యంలో సినిమా సాగుతుంది. ఇదో లేడీ ఓరియెంటెడ్ చిత్రం. డిఫరెంటుగా ఉన్నప్పటికీ...సన్నీ లియోన్‌ను ఆరాధించే శృంగార ప్రియులను నిరాశ పరచకుండా సినిమా ఉంటుందని స్పష్టమవుతోంది.


Click it and Unblock the Notifications











