twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫోర్న్‌స్టార్‌ సన్నీ లియోన్‌, ఆమె భర్తకు ఫుల్ సెక్యూరిటీ

    By Bojja Kumar
    |

    ముంబై: రాబోయే 18 నెలలు ఇండో కెనడియన్ ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్, ఆమె భర్త డేనియల్ వెబర్ పూర్తి భద్రత మధ్య తిరగనున్నారు. వారు ఏం మాట్లాడుకున్నా, ఏం చేసినా, ఎక్కడికి ప్రయాణం చేసినా.....వారిని కెమెరాలు ఫాలో చేయనున్నాయి. వారి ప్రతి మూమెంటును రికార్డు చేయనున్నారు.

    ఎందుకు ఇదంతా? అసలు ఏం జరుగుతోంది? అనే అనుమానం మీకు రావడం సహజమే. వీరిద్దరిపై ఓ డాక్యుమెంటరీ చిత్రీకరిస్తున్నారట. అందులో భాగంగానే ఇదంతా అని అంటున్నారు. 2015లో ఈ డాక్యుమెంటరీ విడుదల చేయనున్నారు. కెనడాకు చెందిన ప్రొడక్షన్ సంస్థ ఒకటి ఈ మేరకు వీరితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

    ప్రస్తుతం సన్నీ లియోన్ బాలీవుడ్లో పలు సినిమా ప్రాజెక్టులకు కమిటైన సంగతి తెలిసిందే. వారి పర్సనల్ లైఫ్‌తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ గురించి కూడా ఈ డాక్యుమెంటరీలో చూపించబోతున్నారు. ఈ హాట్ అండ్ సెక్సీ ఫోర్న్ స్టార్ గురించి ఆ డాక్యుమెంటరీలో ఏం చూపెట్టబోతున్నారు? అనేది ఆసక్తికరంగా మారింది.

    ఇండో-కెనడియన్ ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్ తన ఫోర్న్ కెరీర్‌కు బ్రేక్ వేసి....ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలో తన అదృష్టం పరీక్షించుకుంటున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షో ద్వారా ఇండియాలో ఎంట్రీ ఇచ్చిన సన్నీ లియోన్ జిస్మ్ 2 చిత్రంతో బాలీవుడ్ ఛాన్స్ దక్కించుకుంది. జిస్మ్ 2 చిత్రం బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచినా....ఆమె అందాల ఆరబోత మాత్రం శృంగార ప్రియులు మంచి మార్కులే వేసారు. ఆ తర్వాత 'షూటౌట్ ఎట్ వాడాలా' చిత్రంలో ఐటం సాంగులో నటించి మెప్పించింది. ప్రస్తుతం సన్నీ లియోన్ 'జాక్ పాట్', 'రాగిణి ఎంఎంఎస్ 2', 'టినా అండ్ లోలో' అనే చిత్రాల్లో నటిస్తోంది.

    English summary
    For the next 18 months actress Sunny Leone and her husband Daniel Weber will be under scrutiny. Whatever they say, do, wherever they travel, roving cameras and mics will record their every move. No, this is not for any reality show, but for a film documenting their lives, which will release in 2015.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X