వృద్ధులూ నా ఫ్యాన్స్ అంటోంది
హైదరాబాద్ : నా అభిమానుల్లో కేవలం యువతరమే ఉంటారనుకొంటారు. అది పొరబాటు. వృద్ధులు కూడా నా అభిమానులే. ఈ విషయం ఎంతో ఆనందాన్నిస్తోంది అంటోంది సన్నిలియోన్. ఈ నీలి చిత్రాల తార 'జిస్మ్ 2' తరవాత హిందీ సినీ రంగానికి దగ్గరైంది. ఇటీవలే షూటవుట్ ఎట్ వాదాలా చిత్రంలో ఐటం సాంగ్ చేసింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించింది. సన్నీ ప్రస్తుతం 'రాగిణి ఎమ్.ఎమ్.ఎస్.2'లో నటిస్తోంది.
అలాగే... ''హిందీ చిత్ర ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ కొత్త ఉత్సాహాన్నిస్తోంది. మరిన్ని వైవిధ్యమైన పాత్రల్లో నన్ను చూడాలనుకొంటున్నారు'' అని చెబుతోంది సన్నీ లియోన్.తన సినీ జీవితం గురించి చెబుతూబాలీవుడ్‌లో నటిగా గుర్తింపు తెచ్చుకోవాలన్న నా కల నెరవేరుతోంది. నటనకు సంబంధించి నేనింకా నేర్చుకొనే దశలోనే ఉన్నాను. 'షూటవుట్...'లో చేసిన లైలా పాట అందర్నీ అలరిస్తోంది అని చెప్పింది.
ఇక సన్ని లియోన్ ఆ మధ్య మీడియాతో మాట్లాడుతూ...తన పేరెంట్స్ పంజాబ్ కి చెందిన వారే నని తాను ఇండియాకు చెందిన దాన్ని అనే అంది. తాను ఫోర్న్ ఇండస్ట్రీలోకి కావాలని వెళ్లలేదని,కానీ డబ్బు సంపాదించటానకి అదో మంచి మార్గం అని తెలిసాక వెళ్లకుండా ఉండలేకపోయాను అంది. మొదట తన తల్లితండ్రులు వ్యతిరేకించారు కానీ తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకోమని తనను దగ్గరకు తీసుకున్నారని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications












