For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

    అలాంటప్పుడు.. భయంతో మాటలు గొంతులోనే ఆగిపోతున్నాయి: సన్నీ లియోన్

    |
    ఆ సందర్భాల్లో గట్టిగా బదులివ్వాలనిపిస్తుంది..!

    'అదే పనిగా దేవున్ని చూస్తూ కూర్చుంటే బోర్ కొడుతుందేమో గానీ.. సన్నీ లియోన్‌ను చూడమంటే ఎన్ని గంటలైనా చూస్తారు..' పోర్న్ స్టార్ నుంచి బాలీవుడ్ నటిగా మారిన సన్నీ గురించి రాంగోపాల్ వర్మ అభిప్రాయం ఇది. వర్మ చెప్పాడని కాదు కానీ.. కేరళలో ఆమెకు లభించిన స్పందన చూసిన మొత్తం దేశమే ఆశ్చర్యపోయింది. తన అందంతో భారతీయుల్ని అంతలా ఆకట్టుకుంటోంది సన్నీ లియోన్. తాజాగా 'సన్నీ కా హంగామా' అనే కార్యక్రమంలో ఆమె పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు..

     ఫిట్‌నెస్‌ సీక్రెట్?:

    ఫిట్‌నెస్‌ సీక్రెట్?:

    రోజూ మా వారు డేనియల్‌ వెబర్‌తో కలిసి జిమ్‌కి వెళ్తాను. కచ్చితంగా గంట నుంచి గంటన్నర పాటు జిమ్ చేస్తాను.

     ఇండియా వచ్చిన మొదట్లో మీ ఫీలింగ్?

    ఇండియా వచ్చిన మొదట్లో మీ ఫీలింగ్?

    నేను ఇక్కడో అతిథిని. ఇక్కడే ఉండిపోదామనుకుంటున్నా..

     బెంగళూరు న్యూ ఇయర్ షో రద్దు వెనుక?:

    బెంగళూరు న్యూ ఇయర్ షో రద్దు వెనుక?:

    తెలియదు. కానీ ఆ సంఘటన నన్ను చాలా బాధపెట్టింది. ఈవెంట్‌ పబ్లిసిటీ కోసం 15 ఏళ్ల క్రితం నాటి నా ఫోటోల్ని వాడారు. అయినా అలాంటి ఈవెంట్‌లో పాల్గొనేంత సెలబ్రిటీని కాదు. ఆ వివాదం టైమ్ లో మీడియా నాకు మద్దతుగా నిలిచింది. మనమెంత సున్నితంగా మాట్లాడితే ప్రేక్షకులు మనం చెప్పేది అంతలా రిసీవ్ చేసుకుంటారు.

     మీరు స్పెషల్ సాంగ్ చేసిన 'రయీస్‌' మోస్ట్ పైరేటెడ్?

    మీరు స్పెషల్ సాంగ్ చేసిన 'రయీస్‌' మోస్ట్ పైరేటెడ్?

    ఇది కూడా చాలా బాధ కలిగించింది. అప్పటికీ టికెట్స్ కొనుక్కుని థియేటర్స్ లో సినిమా చూడాలని షారూఖ్ ఖాన్ ప్రేక్షకులను కోరారు. అయితే పైరసీ బారిన పడినప్పటికీ 'రయీస్‌' ఆల్‌ టైమ్‌ ఇండియన్‌ క్లాసిక్‌ చిత్రంగా నిలిచింది. సాధారణంగా నేను సినిమాలు చూడను. కానీ ఈ సినిమా చూశాను. నాకు నచ్చింది.

     'భయంతో మాటలు గొంతులోనే ఆగిపోతున్నాయి'

    'భయంతో మాటలు గొంతులోనే ఆగిపోతున్నాయి'

    సెక్స్‌ ఎడ్యుకేషన్‌ విషయంలో తల్లిదండ్రులదే బాధ్యత. కేవలం టీచర్స్ చెప్పే పాఠ్యాంశాల వల్ల అది సాధ్యం కాదు. ఈ విషయంలో ఇద్దరు మహిళలు నాకు వ్యతిరేకంగా డిబేట్‌లో పాల్గొన్న వీడియోను చూశాను.

    ఇలాంటి సందర్భాల్లో గట్టిగా బదులివ్వాలనిపిస్తుంది. కానీ చెప్తే ఏమవుతుందోనన్న భయంతో మాటలు గొంతులోనే ఆగిపోతున్నాయి. అయినా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలంటే అరిచి చెప్పాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం.

    మీ అమ్మాయి గురించి?

    మీ అమ్మాయి గురించి?

    పేరు నిషా కౌర్ వెబర్‌. తనొచ్చాక మా జీవితమే మారిపోయింది. ఆడపిల్లలు ఉంటేనే మంచిదని నేను మావారికి ఎప్పుడూ చెప్తుంటాను.

    బిజినెస్ లోకి అడుగుపెడుతున్నారట?

    బిజినెస్ లోకి అడుగుపెడుతున్నారట?

    ఫ్యాషన్‌, కాస్మెటిక్‌ బిజినెస్ చేయబోతున్నాను. వ్యాపారం‌ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మీతో ఓ విషయం పంచుకోవాలి. కొన్నేళ్ల క్రితం ఓ దుస్తుల కంపెనీ నా ఫొటోతో ఓ టీషర్టును డిజైన్‌ చేసింది. అవి మార్కెట్‌లోకి రావడమే ఆలస్యం.. ఐదు నిమిషాల్లో స్టాక్ అయిపోయిందట.

    English summary
    Sunny Leone's recent interview has become a hot topic. Sunny said she is going to start cosmetic business in soon.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more