తెలుగు పాటకు సన్నిలియోన్ సెక్సీ స్టెప్స్(వీడియో)
హైదరాబాద్ : సన్నిలియోన్ అంటే ఇప్పుడు తెలుగు వారికి సైతం పరిచయమైన ఓ పేరు. ఆమె ఒకప్పుడు ఏం చేసేది అనేది ప్రక్కన పెడితే ఇప్పుడు ఆమె తెలుగు తెరని ఏలాలని ఫిక్సైందని మాత్రం అర్దమవుతుంది. రీసెంట్ గా ఆమె ఓ తెలుగు పాటకు స్టెప్స్ వేస్తూ కనిపించింది. అయితే అది కుల్ఫీ అనే చిత్రం కోసం. ఆ చిత్రం ప్రోమో రీసెంట్ గా రిలీజైంది.

మీరు ఓ లుక్కేయండి...
<center><iframe width="100%" height="315" src="//www.youtube.com/embed/ilvMXaXOy0s" frameborder="0" allowfullscreen></iframe></center>
జై, స్వాతి జంటగా శరవణరాజన్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన వడకర్రి చిత్రాన్ని కుల్ఫీ పేరుతో తెలుగుప్రేక్షకులకు అందిస్తున్నారు నిర్మాత నరసింహరెడ్డి సామల. తమిళ దర్శకుడు వెంకట్‌ప్రభు, కస్తూరి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ శంగార నాయిక సన్నిలియోన్ ఓ ప్రత్యేకగీతంలో నర్తించింది. ఈ చిత్రానికి సంబంధించిన అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ సన్నిలియోన్ దక్షిణాదిలో నటించిన తొలిచిత్రమిది. ఇందులో ఆమె ఓ ఐటెమ్‌సాంగ్‌లో నర్తించింది. బ్యాంకాక్‌లో వేసిన సెట్స్‌లో జై, సన్నిలియోన్‌పై ప్రత్యేకగీతాన్ని చిత్రీకరించాం. ఈ పాట సినిమాకు హైలైట్ అవుతుంది. ఇందులోని ఆరుపాటలకు యువన్‌శంకర్‌రాజా అద్భుతమైన సంగీతాన్నందించారు. ఇదే నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.
నిర్మాణ నిర్వాహకులు బాలాజీ మాట్లాడుతూ - ''అందాల నటిగా ఎంతో క్రేజ్ ని సంపాదించుకున్న పోర్న్ స్టార్ సన్నిలియోన్ దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి తొలి చిత్రంగా మా 'కుల్ఫీ'లో స్పెషల్ సాంగ్ చేయడం విశేషం. ఈ పాటను బ్యాంకాక్, దుబాయ్ లో సెట్ వేసి చిత్రీకరించడం జరిగింది. సినిమాకి ఈ పాట హైలెట్ గా నిలుస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ చిత్రం ఉంటుంది'' అని తెలిపారు.
డైలాగ్ రైటర్ కృష్ణతేజ మాట్లాడుతూ - ''మంచి కథ, ఆసక్తికరమైన స్క్రీన్ స్లేతో ఈ చిత్రం రూపొందింది. డైలాగులు, పాటలు బాగుంటాయి. వినోదప్రధానంగా సాగిపోయే రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రమిది. ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో తెలుగుప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది '' అన్నారు.
ఈ చిత్రానికి కెమెరా: ఎస్ సంగీతం: యువన్‌శంకర్‌రాజా, నిర్మాణ నిర్వహణ: ఎ.ఎన్.బాలాజీ, సమర్పణ: శ్రీనివాసరెడ్డి సామల, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శరవణరాజన్.


Click it and Unblock the Notifications











