సన్నీ లియోన్ ‘జిస్మ్ 2’ చిత్రానికి షాక్...
ముంబై: రేపు(ఆగస్టు 3) విడుదల కానున్న ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్ చిత్రం 'జిస్మ్ 2' చిత్రానికి ముంబై మునిపల్ కార్పొరేషన్ షాక్ ఇచ్చింది. ముంబై వ్యాప్తంగా అంటించిన జిస్మ్ 2 పోస్టర్లను తొలగించాల్సిందిగా మేయర్ సునీల్ ప్రభు ఆదేశించారు. ఈ మేరకు సిబ్బంది పోస్టర్లన్నీ తొలగించారు. అందరితో చర్చించిన తర్వాతే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆ పోస్టర్లు అశ్లీలంగా ఉండటమే ఇందుకు కారణం. సన్నీ లియోన్‍ను బట్టలు లేకుండా ఆ పోస్టర్లలో చూపించి జనాలను థియేటర్లకు రప్పించాలని దర్శక నిర్మాతలు వేసిన ప్లాన్ బెడిసి కొట్టినట్లయింది. మేయర్ నిర్ణయం నిర్మాలను, దర్శకులను నిరాశ పరిచింది.
ఒక నీలిచిత్రాల తార జీవన ప్రయాణమే ఈ చిత్రం. కామ వ్యాపారం జరిగే మార్కెట్ నుంచి వచ్చిన మహిళ ప్రేమకోసం తపించిన తీరు ఇందులో ప్రముఖంగా ఉంటుంది. బాలీవుడ్లో తొలి సినిమా కావడంతో సన్నీ లియోన్ తన భర్త డేనియల్ వెబర్‌తో కలిసి ఇండియా వచ్చి సినిమా ప్రమోషన్లలో పాల్గొంటోంది.
పూజాభట్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే మహేష్ భట్ అందించారు. డినో మోరియా, పూజా భట్ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. సన్నీలియోన్‌తో పాటు రణదీప్ హూడా, అరుణోదయ్ సింగ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











