చిరు హీరోయిన్‍కు ఎర్త్ పెట్టిన ఫోర్న్‌స్టార్?
ఇండో కెనడియన్ ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్ త్వరలో ఓ రియాల్టీ షోకు జడ్జిగా వ్యవహరించనుందట. బాలీవుడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ' ఇండియాస్ గాట్ టాలెంట్ ' అనే రియాల్టీ షోలో సన్నీ గెస్ట్ జడ్జిగా పాల్గొననుందట. మనీష్ పాల్, సైరస్ సాహుకర్ ఈ షోను హోస్ట్ చేస్తున్నారు. ఈ షోలో హీరోయిన్ జెనీలియా భర్త రితేష్ దేశ్ ముఖ్, కిరణ్ ఖేర్ కూడా సన్నీ కో-జడ్జిలుగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.
ఆ షో నిర్వహిస్తున్న నిర్వాహకులు మిడ్ డే పత్రికకు ఇచ్చిన సమాచారం ప్రకారం రియాల్టీ షో షూటింగుకు సన్నీ అందుబాటులో ఉంటుందని, సోనాలి బింద్రే స్థానంలో ఆమెను రీప్లేస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా సినీయర్ స్టార్ ధర్మేంద్రను కూడా ఈ షోకు జడ్జిగా వ్యవహరించేందుకు సంప్రదిస్తున్నామని, అయితే అతను పలు చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల ఇంకా ఖరారు కాలేదని అంటున్నారు.
ఇంద్ర చిత్రంలో చిరంజీవితో కలిసి నటించిన సోనాలి బింద్రే ఆ చిత్రంతో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. సోనాలికి ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్ ఎర్త్ పెట్టడం బాలీవుడ్లో చర్చనీయాంశం అయింది. గతంలో సన్నీ లియోన్ బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం సన్నీ 'జిస్మ్2' అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. పూజాభట్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే మహేష్ భట్ అందించారు. డినో మోరియా, పూజా భట్ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. సన్నీలియోన్‌తో పాటు రణదీప్ హూడా, అరుణోదయ్ సింగ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











