twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'తిరస్కరించానని నిర్మాత ఇలా చేసాడు' : పోలీసులతో సన్నీలియోన్‌

    By Srikanya
    |

    హైదరాబాద్‌ : సన్నిలియోన్ రెండు రోజుల క్రితం రేప్ విషయమై చేసిన వ్యాఖ్య అంతటా చర్చనీయాంశమైంది. అయితే ఇప్పుడు తాను అసలు అసలు అలాంటి వ్యాఖ్యలు చేయలేదంటోంది ఆమె. రేప్‌ గురించి తాను ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలూ చేయలేదని శృంగారచిత్రాల నటి సన్నీలియోన్‌ చెబుతున్నారు. కమాల్‌ రషీద్‌ఖాన్‌ అనే బాలీవుడ్‌ నటుడు, నిర్మాత తన ట్విటర్‌ అకౌంట్‌ను హేక్‌ చేసి ఈ ట్వీట్‌ చేశాడంటున్నారు. ఈ మేరకు ఆమె ముంబాయి సైబర్‌ నేర పరిశోధక పోలీస్‌ విభాగానికి ఫిర్యాదుచేశారు.

    ఇంతకూ ఆ వివాదాస్పద ట్వీట్‌లో ఏముందంటే, రేప్‌ నేరం కాదని, అనుకోకుండా జరిగే శృంగారమని సన్నీ లియోన్‌ అన్నట్లుగా ఉంది. సన్నీ లియోన్‌ ఇలా ట్వీట్‌ చేసినట్లు కమాల్‌ ఖాన్‌ రీట్వీట్‌ చేశాడు. ఇది ఎవరో మూర్ఖుడు చేసిన పిచ్చి వ్యాఖ్య అని సన్నీ చెప్పింది. తాను ఎప్పుడూ అలాంటి వ్యాఖ్య చేయలేదని పేర్కొంది.

    తనను ఎవరు ఏమన్నా పట్టించుకోనని, అయితే అలాంటి వ్యాఖ్యలు తాను చేసినట్లుగా మాత్రం భావించొద్దని కోరింది. కమాల్‌ తన సినిమాలో నటించమని గతంలో తనను కోరాడని, తాను తిరస్కరించానని అందుకే ఇలా చేసి ఉండొచ్చని చెప్పింది. సన్నీ ప్రస్తుతం రాగిణి ఎమ్‌ఎమ్‌ఎస్‌-2 హిందీ చిత్రంలో నటిస్తోంది.

    బాలీవుడ్ సినిమాలతో భారతీయులకూ పరిచయమైన ఆమె ట్విట్టర్‌లో చేసినట్లుగా ఉన్న వ్యాఖ్య ఇదే... 'రేప్ నేరం కాదు. అది... అనుకోకుండా జరిగే శృంగారం' (రేప్ ఈజ్ నాట్ ఎ క్రైమ్. ఇట్ ఈజ్ సర్‌ప్రైజ్ సెక్స్) . అయితే కాసేపటికేఆ ట్వీట్‌ను తొలగించారు. కానీ, అప్పటికే జరగాల్సినంత ప్రచారం జరిగిపోయింది. వేల సంఖ్యలో ఉన్న ఆమె అభిమానులు ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు.

    English summary
    "Jism 2" actress Sunny Leone has filed a complaint against actor Kamal R Khan in the Cyber Crime Investigation Cell for falsely attributing a controversial rape comment to her on his Twitter page. A few days back, Leone had reportedly tweeted some controversial comment on rape which she later denied, claiming her account was hacked for a few minutes.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X