Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
పచ్చి బూతులతో బాయ్స్ టీజర్.. బోల్డ్ సీన్లకు నోరెళ్లబెట్టిన సన్నీ లియోన్.. చితకొట్టేశారుగా..
ఒకప్పుడు బోల్డ్ సీన్స్ అంటే ఓ వర్గం సినిమాల్లోనే ఎక్కువగా కనిపించేవి. బాలీవుడ్ లో అయితే ముందు నుంచి చాలా వస్తున్నాయి. ఇక ఆ గాలి మెల్లగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా వచ్చేసింది. 18+ కంటెంట్ తో కొంతమంది తెలివిగా తెరకెక్కిస్తున్న సినిమాలకు బజ్ బాగానే క్రియేట్ అవుతోంది. ఇక ఇటీవల సన్నీ లియోన్ చేతుల మీదుగా విడుదల చేసిన బాయ్స్ టీజర్ కూడా అందరిని షాక్ కు గురి చేసింది. సన్నీ లియోన్ సైతం అందులో బోల్డ్ సీన్స్ కు ఆశ్చర్యానికి గురైంది.
కథలో భాగంగా చాలా తెలివిగా
బోల్డ్ సీన్స్ అంటే ఈ రోజుల్లో కామన్ గా మారిపోయాయి. కొందరు కావాలని అలాంటి సన్నివేశాలను ఇరికిస్తుంటే మరికొందరు మాత్రం కథలో భాగంగా చాలా తెలివిగా అలాంటి సీన్స్ ను వాడేస్తున్నారు. అలాంటి సినిమాలకు కలెక్షన్స్ కూడా కొన్నిసార్లు గట్టిగానే అందుతున్నాయి. ఇక త్వరలోనే బాయ్స్ అనే సినిమా కూడా అదే తరహాలో క్లిక్కయ్యేలా ఉన్నట్లు ఒక టాక్ అయితే వస్తోంది.
విభిన్నమైన బోల్డ్ కంటెంట్ తో
ఇక అప్పట్లో శంకర్ బాయ్స్ సినిమా ఏ తరహాలో వచ్చిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు అదే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా విభిన్నమైన బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కినట్లు తెలుస్తోంది. నేటితరం యంగ్ జనరేషన్ లో జరిగే రెగ్యులర్ రొమాంటిక్ విషయాలని సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.
ఆ సీన్స్ కు నోరెళ్లబెట్టిన సన్నీ లియోన్
ఇక సినిమా టీజర్ ను హాట్ బ్యూటీ సన్నీ లియోన్ చేత లాంచ్ చేయించారు. టీజర్ చూసిన సన్నీ ఆ సీన్స్ కు షాక్ అయ్యింది. దెబ్బకు నోరెళ్లబెట్టి అమేజింగ్ అని ప్రశంసలు కూడా కురిపించారు. ప్రస్తుతం టీజర్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బూతు సీన్లతో పాటు బూతు మాటలు కూడా గట్టిగానే వాడేశాడు.
టీజర్.. ఈ రేంజ్ లో ఉందంటే..
గ్లామరస్ బ్యూటీ మిత్రా శర్మ నిర్మాతగానే కాకుండా సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కూడా నటిస్తోంది. శ్రీహాన్, రోహిత్, అన్షులా దావన్, శీతల్ తివారి, సుజిత్ వంటి వారు మెయిన్ లీడ్ లో నటిస్తున్నారు. అలాగే బిగ్ బాస్ 2 తెలుగు టైటిల్ విన్నర్ కౌశల్ మండా కూడా ఒక ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాను దయానంద్ డైరెక్ట్ చేశాడు. టీజర్ తోనే ఈ రేంజ్ లో షాక్ ఇచ్చారు అంటే ఇక సినిమతో ఏ రేంజ్ లో షాక్ ఇస్తారో చూడాలి.