దుమ్మురేపిన సన్నీ లియోన్, ఎగబడ్డ జనం
న్యూఢిల్లీ : ఇండో-కెనడియన్ ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్ అతి తక్కువ కాలంలోనే భారీ పబ్లిసిటీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షో ద్వారా ఇండియాలో అడుగు పెట్టిన సన్నీ లియోన్ పేరు మీడియాలో బాగా చర్చనీయాంశం అవ్వడం, తద్వారా 'జిస్మ్-2' చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుని సెలబ్రిటీగా మారి పోవడం వెంట వెంటనే జరిగి పోయింది.
సన్నీలియోన్ ఇండియాలో ఇంతలా ఎదగడానికి కారణం ఆమె సెక్స్ చిత్రాల్లో నటించే ఫోర్న్ స్టార్ కావడమే. అప్పటి వరకు ఫోర్న్ స్టార్ అంటే పరిచయం లేని ఇండియన్ ప్రేక్షకులు ఆమె గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపడం మొదలు పెట్టారు. ఇంటర్నెట్లో ఆమె అశ్లీల చిత్రాలు, ఫోస్టర్లు విరివిగా అందుబాటులో ఉండటంతో సన్నీలియోన్ రేంజే పెరిగిపోయింది. ఫలితంగా ఇండియన్ సినీ సెలబ్రిటీల లిస్టులో చోటు దక్కించుకున్న సన్నీపలు బాలీవుడ్ చిత్రాల్లో అవకాశం దక్కించుకుంది.
ఇటీవల న్యూఇయర్ వేడుకల్లో సందడి చేసిన సన్నీ లియోన్ తన పెర్ఫార్మెన్స్ తో దుమ్ము రేపింది. దేశ రాజధాని న్యూఢిల్లీలోని లలిత్ హోటల్లో లైఫ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి అదరగొట్టింది. పలు బాలీవుడ్ సూపర్ హిట్ సాంగుకులకు స్టెప్పులేసి కేక పుట్టింది. సన్నీ లియోన్ పెర్ఫార్మెన్స్ అనగానే ఆమె అభిమానులు...డబ్బుకు వెనకాడకుండా, ఖరీదు ఎక్కువైనా పట్టించుకోకుండా ఈ షోకు హాజరయ్యారు. చిట్టి పొట్టి దుస్తులతో సన్నీ లియోన్ అందాల విందు చేస్తుంటే....తెగ ఎంజాయ్ చేసారు.
సన్నీ పెర్ఫార్మెన్స్ గురించి...సన్నీలియోన్ భర్త, మేనేజర్ డేనియల్ వెబర్ స్పందిస్తూ సన్నీ లియెన్ షోకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఫ్యాన్స్ చాలా బాగా ఎంజాయ్ చేసారు. ఈ రేంజిలో రెస్పాన్స్ వస్తుందని అస్సలు ఊహించలేదు అంటూ ఆనందం వ్యక్తం చేసాడు. అన్నట్లు ఈ షో ఇవ్వడానికి దాదాపు రూ. కోటి వరకు చార్జ్ చేసిందట సన్నీ లియోన్.


Click it and Unblock the Notifications












