»   » కాలేజీ వెల్కం పార్టీలో పోర్న్ స్టార్స్.... చీరల్లో సన్నీ, మియా ఖలీఫా ల సందడి

కాలేజీ వెల్కం పార్టీలో పోర్న్ స్టార్స్.... చీరల్లో సన్నీ, మియా ఖలీఫా ల సందడి

Posted By:
Subscribe to Filmibeat Telugu

కాలం మారూతూంటే ప్రతీ దాన్లోనూ కొత్త కొత్త పోకడలు మొదలవుతాయి.మామూలుగా ఒక సినిమా వేడుకలోనో, లేదంటే ఏ షాపింగ్ మాల్ దగ్గరో సినీ తారల కటౌట్ లు పెట్టటం మామూలే కానీ సాంప్రదాయ వేడుకల దగ్గర..!? అదీ మామూలు హీరోయిన్లు కాకుండా పోర్న్ స్టార్స్ అయితే..!? నిజానికి పోర్న్ స్టార్స్ మీద అంత వ్యతిరేకత ఉండటానికి కారణం వాళ్లు ఎంచుకున్న వృత్తిపై ద్వేషమే కానీ ఈ పరిస్థితి అంతా ఒకప్పుడు.

సన్నీలియోన్ బాలీవుడ్ ఎంట్రీ తో ఇప్పుడీ పరిస్థితి మారింది.. పోర్న్ స్టార్‌ సన్నీలియోన్ బాలీవుడ్‌లో ఇప్పటికే అనేక చిత్రాలతో మెప్పించింది. తన జీవితం ఒకప్పుడు అలా ఉండేదని, ఇప్పుడు వాటన్నింటికీ దూరంగా ఉన్నానని పలు సందర్భాల్లో సన్నీలియోన్ చెప్పింది. అప్పటి నుంచి సన్నీపై చాలామంది అభిమానం పెంచుకున్నారు. పోర్న్ స్టార్ గా కంటే ఇప్పుడు సన్నీ లియోన్ ఒక బాలీవుడ్ హీరోయిన్ గానే చాలామందికి తెలుసు.కానీ ద్వేషించే వాళ్లు ఎప్పటికీ ద్వేషిస్తూనే ఉంటారు. అవన్నీ వదిలేస్తే అయితే కేరళలో కొత్తగా కాలేజీ కివచ్చే జూనియర్లకు స్వాగతం చెప్పటానికి కొత్త పద్దతిని ఎంచుకున్నారు సీనియర్ విధ్యార్థులు .

 Sunny Leone and Mia Khalifa welcomed freshers to this Kerala college

అయితే కొట్టాయం జిల్లాలోని శ్రీనారాయణ పాలిటెక్నిక్ కళాశాలలోని సెకండియర్ స్టూడెంట్స్ జరుపుకున్న వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కాలేజిలో జరుగుతున్న వెల్కం పార్టీలో పోర్న్ స్టార్స్ సన్నీలియోన్, మియా కలీఫా స్వాగతం పలికారు. అదీ అచ్చమైన కేరళ సాంప్రదాయ దుస్తులలో. తెల్లని చీరా తో ఇద్దరూ వయ్యారం గా నమస్కారం చేస్తూ అథిథులను ఆహ్వానించారు.

అయితే నిజంగా కాదులెండి అసలు సంగతేమిటంటే... అందరూ ఏవైనా వేడుకలు జరిగితే ఏ హీరో ఫోటోతోనో, హీరోయిన్ల ఫోటోలతోనో స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేస్తారు. కానీ ఈ కాలేజీ స్టూడెంట్స్ మాత్రం పోర్న్ స్టార్స్‌పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. సన్నీలియోన్, మియా ఖలీఫాలను ఫోటో‌షాప్‌ సాయంతో అచ్చమైన కేరళ కుట్టీల్లాగా తయారుచేసి బ్యానర్లు కట్టారు. ఈ స్వాగతం బ్యానర్ ని ఎవరో ఫేస్బుక్ లో పోస్ట్ చేయటం తో వీళ్ళ ఆలోచనకి ముక్కున వేలేసుకుంటూనే విపరీతంగా షేర్ చెస్తున్నారు. సన్నీ ఏమో గానీ మియా ఖలీఫా మాత్రం నిజమైన కేరళ అమ్మాయిలానే ఉంది మరి..

(Photo Source: The Back Benchers/Facebook)

English summary
Sree Narayana Polytechnic College in Kerala’s Kollam district, had a poster with the faces of two popular adult film stars as part of the welcoming committee Bollywood star Sunny Leone and Mia Khalifa were finely edited and added to the poster.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu