»   » ఏందీ బీభత్సం!?, కేరళ అట్టుడికిందీ: అక్కడ సన్నీలియోన్ ఒక మాస్ హిస్టీరియా (వీడియో)

ఏందీ బీభత్సం!?, కేరళ అట్టుడికిందీ: అక్కడ సన్నీలియోన్ ఒక మాస్ హిస్టీరియా (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

సన్నీ ఒకప్పుడు పోర్న్ స్టార్... అలా తాను ఒక శృంగార తారగా మారటానికి దారితీసిన పరిస్థితులను చెప్పుకొనీ, తనకున్న సమస్యలు తీరిపోయాక బాలీవుడ్ లోకి వచ్చి ఇప్పుడు ఆ పాత జీవితానికి స్వస్తి చెప్పేసింది కూడా. ఇప్పుడు బాలీవుడ్ లో ఆమె చేస్తున్నవి కొంత శృంగార పాత్రలే అయినా కొత్తగా సన్నీ వల్ల బాలీవుడ్ చెడి పోయిందేమీ లేదు ఆమెకంటే ముందే మల్లికా శరావత్, రాఖీ సావంత్ లాంటి నటీమణులు బాలీవుడ్ ని సుభిక్షంగానే ఉంచారు. కానీ సన్నీ ని మాత్రం ఆ పాత గతం వెంటాడుతూనే ఉంది. కొన్నిసార్లు బాలీవుడ్ లో ఆమె అవమానాలకు గురవుతూనే వచ్చింది.

ఫిల్మ్ మేకర్స్ మాత్రమే కాదు

ఫిల్మ్ మేకర్స్ మాత్రమే కాదు

అయితే నెమ్మదిగా పరిస్థితి మారుతోంది. ఆమెనీ ఒక నటిగా గుర్తిస్తున్నారు. ఆమెతో తమ సినిమాల్లో అందాలు ఆరబోయించడానికి ఫిల్మ్ మేకర్స్ మాత్రమే కాదు...పలు పాపులర్ మేగజైన్స్ కూడా తమ కవర్ పేజీలపై ఆమె హాట్ ఫోజుల కోసం పోటీ పడుతున్నాయి. మామూలుగా ఒక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంటే కూడా బిజీగా ఉంది సన్నీ. రకరకాల షో లలో డాన్స్ చేయటానికి కూడా సన్నీ కి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.

కేర‌ళ అభిమానుల ఘ‌న స్వాగ‌తం

కేర‌ళ అభిమానుల ఘ‌న స్వాగ‌తం

ఆమెకూ ఫ్యాన్స్ పెరుగుతున్నారు. నిన్నగాకమొన్న బాలీవుడ్ బ్యూటీ స‌న్నీ లియోన్ కి కేర‌ళ అభిమానులు ఘ‌న స్వాగ‌తం పలికారు. కొచ్చిలో ఓ మొబైల్ కంపెనీ ఇనాగ‌రేష‌న్ కోసం అక్క‌డికి వెళ్ళిన స‌న్నీని చూసేందుకు జ‌నాలు తండోప‌తండాలుగా త‌ర‌లి వ‌చ్చారు.

ప్రాంగ‌ణం మొత్తం జ‌న‌సంద్రం

ప్రాంగ‌ణం మొత్తం జ‌న‌సంద్రం

ఒక సూపర్ స్టార్ లాంటి హీరోగాని, లేక ఒక రాజకీయ నాయకుుడు గాని వచ్చినా ఇంత జనం వస్తారో రారో తెలియదు గాని సన్నీ లియోన్ చూడటానికి అంతమంది కేర‌ళ అభిమానులు వచ్చారు. జనం రాక‌తో ఆ ప్రాంగ‌ణం మొత్తం జ‌న‌సంద్రంగా మారింది. కొచ్చిలోని ఎంజీరోడ్ లో ఉన్న షాప్ ఓపెనింగ్ కి సన్నీ రావ‌డం చాలా ఆల‌స్య‌మ‌వుతుంద‌ని తెలిసిన కూడా ఆమె కోసం గంట‌ల త‌ర‌బ‌డి వెయిట్ చేశారు అభిమానులు.

నేను ధ‌న్యురాలిని

నేను ధ‌న్యురాలిని

వీరి ప్రేమ‌కు స‌న్నీ ఫిదా అయింది. కొచ్చి ప్ర‌జ‌లు చూపించిన ప్రేమ‌కు నేను ధ‌న్యురాలిని. వారి ప్రేమ‌ను జీవితంలో ఎప్ప‌టికి మ‌ర‌చిపోలేను అంటూ కామెంట్ పెట్టి,ఓ వీడియోని పోస్ట్ చేసింది స‌న్నీ. అయితే ఒబామా, ట్రంప్ త‌ర్వాత సన్నీ లియోన్ కోసం ఇంత భారీగా ప్ర‌జ‌లు హాజ‌రు అయ్యారు అంటూ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్.

సంజయ్ దత్ హీరోగా చేస్తున్న భూమి

సన్నీ కి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ చూడటం మొదటిసారి అని భావిస్తున్నారు. . ఈ హాట్ బ్యూటీ ప్ర‌స్తుతం సంజయ్ దత్ హీరోగా చేస్తున్న భూమి అనే చిత్రంలో ట్రిపి ట్రిపి అనే స్పెష‌ల్ సాంగ్ చేయ‌గా, బాద్ షా హో చిత్రంలో పియామోర్ అనే ఐటం సాంగ్ చేస్తుంది.

English summary
Actor Sunny Leone reacts in awe as huge crowds jostled to catch a glimpse of her in Kochi on Thursday. The popular actor was in the city for the launch of a new shop of a mobile phone retailer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu