»   » ఆ మార్గంలోనూ సంపాదించాలనే ప్లాన్లో సెక్స్ బాంబ్!

ఆ మార్గంలోనూ సంపాదించాలనే ప్లాన్లో సెక్స్ బాంబ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ఇండో కెనడియన్ ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్....ఇండియాలో అడుగు పెట్టి తన అందాలతో ఇక్కడి యూత్‌ను మత్తెక్కిస్తూ బాలీవుడ్లో తన మార్కెట్ పెంచుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. ఆమె నటించిన 'జాక్ పాట్' సినిమా ప్రమోషన్ కోసం దేశంలోని ప్రధాన నగరాల్లో పర్యటించి చాలా కష్టపడింది.

త్వరలో సన్ని లియోన్ అమెరికా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటోందట. అమెరికాలో బిజినెస్ మొదలు పెట్టేందుకే ఆమె అక్కడికి వెలుతున్నట్లు స్పష్టమవుతోంది. తన భర్త డేనియల్ వెబర్‌తో కలిసి లాస్ ఏంజిల్స్‌లో బాక్సింగ్ జిమ్ ప్రారంభించాలనే ఆలోచనలో ఉందట ఈ హాట్ అండ్ సెక్సీ సుందరాంగి.

 Sunny Leone

ప్రముఖ బాక్సింగ్ ఛాంపియన్ ది టెర్రిబుల్ టెర్రీ నోరిస్‌‌తో కలిసి ఈ వెంచర్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలో ఇందుకు సంబంధించిన డీల్ కుదుర్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ బాక్సింగ్ జిమ్‌ను ఇంటర్నేషనల్ లెవల్లో తీర్చి దిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. సో... అటు ఫోర్న్ సినిమాలు, ఇటు బాలీవుడ్ సినిమాలు, మరో వైపు ఈ వ్యాపారం...ఇలా సంపాదించడానికి వీలైన ఏ మార్గాన్ని వదలడం లేదు సన్నీ లియోన్.

సన్నీ లియోన్ నటించిన జాక్ పాట్ సినిమా వివరాల్లోకి వెళితే...ఈ చిత్రంలో సన్నీ లియోన్-సచిన్ జోషి లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కైజాద్ గుస్తాద్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం సన్నీ లియోన్ హీరోయిన్‌గా మరో బాలీవుడ్ సినిమా కూడా తెరకెక్కుతోంది. జాక్ పాట్ సినిమాతో పాటు రాగిణి ఎంఎంఎస్-2 సినిమాలోనూ నటిస్తోంది.

English summary
After the release of her film 'Jackpot', actress Sunny Leone has other plans as she would be visiting US soon. Along with her husband Daniel Weber, the actress is now planning to open a boxing gym at Los Angeles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu