సన్నీ లియోన్ హైదరాబాద్ వచ్చేస్తోంది: వీడియో మెసేజ్ పెట్టిమరీ కంఫార్మ్ చేసింది

ఎవరు ఎన్ని అనుకున్నా, సన్నీ లియోన్ కు వున్న ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువేమీ కాదు. లక్కీగా మన తెలుగు సినిమాల్లో ఆమెను అడపాదడపా తీసుకోవడం వల్ల, తెలుగు ఫంక్షన్ ల్లో కూడా సన్నీ కనిపిస్తోంది. తనమీద ఉన్న ఆ పోర్న్ ట్యాగ్ ని వదిలించుకుని ఇప్పుడు మామూలు ఐటం భామగా టాలీవుడ్ లోనూ కనిపించినా జనం మామూలుగానే రిసీవ్ చేసుకుంటున్నారు.

Recommended Video

Filmibeat Top Ten Stories ఫిల్మిబీట్ టాప్ టెన్ స్టోరీస్..
పి.ఎస్.వి గరుడ వేగ 126.18ఎం.

పి.ఎస్.వి గరుడ వేగ 126.18ఎం.

బాలీవుడ్ నుంచి తెలుగులోకీ వచ్చేసింది సన్నీ.., ‘కరెంటు తీగ'లో చేసినప్పటికీ సన్నీ ని తెలుగు జనం అంతగా పట్టించుకోలేదు. అయితే గత సంవత్సరం బాలీవుడ్ లో వచ్చిన "రయీజ్" లో లైలా మై లైలా అంటూ సన్నీ తిప్పిన నడుముని చూసి అబ్బా..! చాలా మిస్సయ్యాం సన్నీ అనుకున్నారు.

 యాక్షన్ ఎంటర్టైనర్

యాక్షన్ ఎంటర్టైనర్

యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ నటిస్తున్న గరుడ వేగలో చేసిన ఐటం సాంగ్ ఇప్పటికే దుమ్మురేపుతోంది. ఎల్బీ డబ్ల్యూ, రొటీన్ లవ్ స్టోరీ, చందమామ కథలు వంటి అద్భుత చిత్రాలు తెరకెక్కించిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు గరుడ వేగ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు. పి.ఎస్.వి గరుడ వేగ 126.18ఎం. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందగా, ఈ చిత్రంలో పూజా కుమార్, శ్రద్ధాదాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అక్టోబర్ 27న ఆడియో వేడుక

అక్టోబర్ 27న ఆడియో వేడుక

త్వరలోనే మూవీ రిలీజ్ కి ప్లాన్ చేస్తుండగా, హైదరాబాద్ లో అక్టోబర్ 27న ఆడియో వేడుక జరపాలని టీం భావిస్తుంది. ఈ కార్యక్రమంలో సన్నీ.. డియో డియో అనే సాంగ్ కి లైవ్ పర్ ఫార్మెన్స్ ఇవ్వనుందట. మరి అభిమానులు సన్నీ లైవ్ పర్ ఫార్మెన్స్ చూసేందుకు సిద్ధం కండి.

పెద్దమొత్తమే అడిగింది

పెద్దమొత్తమే అడిగింది

ఇప్పుడు ఈ ఈవెంటుకు సన్నీ లియోన్ వస్తోందని ఒకసారి.. అబ్బే పెద్దమొత్తమే అడిగింది ఆడటానికి.. అందుకే రావట్లేదు అని మరోసారి మనం చాలా రూమర్లు విన్నాం. అయితే సన్నీ మాత్రం తాను ఈ ఈవెంటుకు వస్తున్నట్లు ఏకంగా ఒక వీడియో ద్వారా ప్రకటించింది.

 ఉవ్విళ్ళూరిపోతున్నారు

ఉవ్విళ్ళూరిపోతున్నారు

ఈ నెల 27న ఆ ఈవెంట్లో అమ్మడు 'డియో డియో' అంటూ సినిమాలో తాను చేసిన ఐటెం సాంగుకు స్టెప్పులేయనుందట. మీరందరూ మిస్సవ్వకండి వచ్చేయండి అంటూ ఇప్పుడు వీడియో మెసేజ్ ఇచ్చేసరికి.. ఆ మెసేజ్ అందుకున్న యూత్.. మీడియా.. అందరూ ఉవ్విళ్ళూరిపోతున్నారు. ఎప్పుడెప్పుడు సన్నీ వస్తుందా అని ఇప్పటినుండే నిద్రపోవడం మానేసి వెయిట్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X