»   » రష్మి కి చెక్ పెట్టేందుకే సన్నీ లియోన్.... రష్మి కి ఇదీ హ్యాపీ న్యూసే

రష్మి కి చెక్ పెట్టేందుకే సన్నీ లియోన్.... రష్మి కి ఇదీ హ్యాపీ న్యూసే

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రవీణ్ సత్తారు తీసిన ఎడల్ట్ ఎంటర్‌టైనర్ 'గుంటూరు టాకీస్'కి సీక్వెల్ రాబోతోంది. ఫస్ట్ పార్ట్ కమర్షియల్‌గా సక్సెస్ కావడంతో.. ప్రొడ్యూసర్ రాజ్‌కుమార్ దీనికి సీక్వెల్ తీయాలని డిసైడ్ అయ్యాడని సమాచారం. 'గుంటూరు టాకీస్-2' టైటిల్‌తో సెకండ్ పార్ట్‌కు రెడీ అయ్యాడని అంటున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కించనున్న ఈ మూవీ షూటింగ్ చాలా భాగం ముంబైలోనే జరగనుంది. ఇందులో బాలీవుడ్ నటి సన్నీ లియోన్ కీలక పాత్ర పోషిస్తుందట. సన్నీ అనగానే పార్ట్ వన్ లో శ్రద్దా దాస్ చేసిన బుల్లెట్ రాణి పాత్రలో కనిపిస్తుందేమో అనుకున్నారంతా.

అయితే ఆ పాత్రకి మొదటి భాగం లోనే ముగింపు చెప్పేసాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. అప్పుడు సన్నీ చేసే పాత్ర నే కీలకమైన హీరోయిన్ పాత్ర అవనుందా అనే అనుకుంటున్నారంతా... అంతే కాదు ఈ పార్ట్ లో ప్రవీణ్ కేవలం లోకల్ సినిమా గా కాకుండా కాస్త పెద్ద ఎత్తునే తీయాలనుకుంటున్నాడట అందుకే ఎక్కువ భాగం ముంబై లోనే చ్త్రీకరించనున్నారు.

Sunny Leone to play a Telugu girl in sequel of Guntur second

పోర్న్ సినిమాల నుంచి బాలీవుడ్‌లోకి వచ్చిన సన్నీలియోన్ అంటే చాలామందికి 'ఎ' సర్టిఫికెట్ మూవీసే గుర్తొస్తాయి. ఈ హాట్ లేడీ సైతం తనకు సూటయ్యే హాట్ హాట్ కథాంశాలనే ఎంపిక చేసుకుంటూ కెరీర్‌ను కంటిన్యూ చేస్తోంది. ఆ మధ్య తెలుగులో వచ్చిన 'కరెంట్ తీగ'లో కాసేపు ఆడియెన్స్‌ను మురిపించిన సన్నీలియోన్.. మళ్లీ చాలాకాలం తరువాత తెలుగులో తళుక్కుమనేందుకు సిద్ధమవుతోంది. ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్‌లో వచ్చిన 'గుంటూరు టాకీస్'కు సీక్వెల్ ఇటీవలే మొదలైంది. అందులో నటించేందుకు ఈ సెక్సీ బ్యూటీ ఓకే చెప్పింది. దీంతో ఈ సినిమాలో హాట్ లేడీ రోల్ ఎలా ఉంటుందనే దానిపై అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి.

'గుంటూరు టాకీస్' మూవీలో హాట్‌గా కనిపించే రోల్స్‌లో శ్రద్ధాదాస్, రష్మీ కనిపించగా... శ్రద్ధా దాస్ పాత్రకు ఫస్ట్ పార్ట్‌లోనే ముగింపు పలికేశాడు దర్శకుడు. ఇక ఇందులో హాట్‌గా కనిపించే రోల్ రష్మీదే కాబట్టి... జబర్దస్త్ యాంకర్ ప్లేస్‌ను సన్నీ కొట్టేసిందని కొందరు భావిస్తున్నారు. 'గుంటూరు టాకీస్' ప్రమోషన్స్ విషయంలోనూ దర్శకనిర్మాతలకు రష్మీ సహకరించలేదని అందుకే ఆమెకు హ్యాండ్ ఇచ్చారనే టాక్ ఉంది.

అయితే ఈ సీక్వెల్ మూవీలో సన్నీ లియోన్ నిజంగానే రష్మీ రోల్ లో కనిపిస్తుందా లేక హాట్ లేడీ కోసం శ్రద్ధా దాస్ తరహాలో మరో నయా రోల్ ను క్రియేట్ చేస్తారా అన్న అంశం ఆసక్తిగా మారింది. ఏదేమైనా... ఫ్యామిలీ ఆడియెన్స్ కు దూరంగా ఓ వర్గం ప్రేక్షకులను మాత్రమే ఆకట్టుకున్న 'గుంటూరు టాకీస్' సీక్వెల్ సన్నీ లియోన్ కు కరెక్ట్ గా సరిపోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి... 'గుంటూరు టాకీస్ 2' సన్నీలియోన్ కు తెలుగులో ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి.

అయితే ఇప్పుడు ఇక్కడ సన్నీ లియోన్ స్థానం బాలీవుడ్లో తక్కువేం కాదు కానీ ఇక్కడ రష్మీ అంటే కేవలం, చిన్న సినిమాల హీరోయిన్ గానే ఉంది అలాంటిది రష్మి కి పోటీగా సన్నీ ని దించుతున్నారూ అంటే రష్మీ కి ఉన్న భలం ఏమిటో అర్థమవుతోంది. ఇప్పుడున్న హీరోయిన్లలో చిన్న సినిమాలకి రష్మి ఒక స్టార్ హీరోయిన్ అనే చెర్ప్పుకోవాలి. టాలీవుద్ లో గుంటూర్ టాకీస్ వంటి సినిమాకి సరిపోయే స్టార్ స్టేటస్ ఉన్న నటి హీరోయిన్ రష్మి మాత్రమే. అందుకే ఏకంగా బాలీవుద్ నుంచి సన్నీని దించుతున్నారు. సో రష్మికి ఇది కాస్త ఆనందం కలిగించే విషయమే అనుకోవాలి

English summary
Latest buzz is that Sunny Leone in Guntur Talkies Sequel Replaces Rashmi Gautam
Please Wait while comments are loading...