»   » అప్పుడే కుర్రాళ్ళు తట్టుకోలేకపోయారు... తెలుగమ్మాయి గా పార్ట్ 2 లో సన్నీ లియోన్ అట

అప్పుడే కుర్రాళ్ళు తట్టుకోలేకపోయారు... తెలుగమ్మాయి గా పార్ట్ 2 లో సన్నీ లియోన్ అట

Posted By:
Subscribe to Filmibeat Telugu

రష్మీ గౌతమ్ మరియు సిద్ధూ జంటగా ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో నటించిన చిత్రం 'గుంటూరు టాకీస్' గుర్తుంది కదా. కాస్తంత స్పైస్ ఎక్కువయ్యి వెరీ లోకల్ అనిపించుకున్న ఈ సినిమాలో రష్మీ అందాల ఆరబోతని ఇంకా మర్చిపోకముందే రెండో భాగం కూడా మొదలు పెడుతున్నాడట ప్రవీణ్ సత్తారు.
అప్పట్లో అటు సువర్ణ గా రష్మీ.., ఇటు బుల్లెట్ రాణి గా శ్రద్దా దాస్ పోటీ పడి మరీ హాట్ సీన్లలో నటించేసారు. ఈ సినిమా ఎంత సంచలనమైందో తెలిసిందే. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించిన నేపథ్యంలో ఈ సినిమాకుసీక్వెల్ తీసే పనిలొ ఉన్నారు దర్శక నిర్మాతలు.

Sunny Leone to play a Telugu girl in sequel of Guntur Talkies

ఈ సీక్వెల్ లో 'కరెంటు తీగ' టీచర్ పాత్రలో మరియు ఐటెం సాంగ్ తో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన బాలీవుడ్ నటి పోర్న్ స్టార్ సన్నీ లియోన్ నటించనుంది. ఇందులో సన్నీ హంటర్ రాణి పాత్ర పోషించనుంది. క‌రెంటుతీగ‌లో మంచు మ‌నోజ్‌తో క‌లిసి సంద‌డి చేసిన స‌న్నీ తెలుగు ప్రేక్ష‌కుల‌కి బాగా న‌చ్చింది. కుర్ర‌కారు ఆమెని చూసేందుకు ఉత్సాహం చూపించారు. అయితే ఆ త‌ర్వాత ఆమెని మ‌ళ్లీ ఎవ్వ‌రూ ఎంపిక చేసుకోలేదు. పారితోషికం భార‌మ‌వుతుందనో లేదంటే, సినిమాలో ఆమె న‌టిస్తే ప్రేక్ష‌కుల్లోకి వేరే సంకేతాలు వెళ‌తాయ‌నో తెలియ‌దు కానీ... కరెంటు తీగ త‌ర్వాత తెలుగు తెర‌పై క‌నిపించ‌లేదు. కాస్త విరామం త‌ర్వాత గుంటూరు టాకీస్ 2 కోసం ఎంపికైంది. ఈ సందర్బంగా చిత్ర దర్శకనిర్మాత రాజ్‌కుమార్‌.ఎం మాట్లాడుతూ చిత్ర దర్శకనిర్మాత రాజ్‌కుమార్‌.ఎం. మాట్లాడుతూ

''20 రోజులు సన్నీకి సంబంధించిన సీన్లు తెరకెక్కిస్తాం. దక్షిణాదిన ఆమె పూర్తిస్థాయి పాత్రలో నటిస్తున్నది మా చిత్రంలోనే. తమిళ్‌, హిందీలోనూ విడుదల చేస్తాం. దసరా నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెడతాం. మార్చిలో విడుదల చేస్తాం. కుటుంబకథా చిత్రంగా మలుస్తాం'' అని చెప్పారు. ఆర్‌.కె.స్టూడియోస్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో నటులు నరేశ, వినీత, హేమంత, నటి అదితిసింగ్‌, కథ, స్ర్కీనప్లే రచయిత కిరణ్‌ పాల్గొన్నారు. మహేశ మంజ్రేకర్‌, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, పృథ్విరాజ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్‌, కెమెరా: రామిరెడ్డి, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఆర్ట్‌: మారిష్‌.

English summary
The Bollywood sex bomb Sunny Leone is set to do another Telugu film. She has agreed to play a lead role in a new movie titled ‘Guntur Talkies 2’
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu