twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సన్నీ లియోన్ ...డబుల్ ధమాకా

    By Srikanya
    |

    ముంబై: సన్ని లియోన్ ని పెద్ద తెరమీద చూడటానికి చూపిస్తున్న ఆసక్తిని రెట్టింపు చేయాలనుకుంటున్నారు మస్తీ జాదే నిర్మాతలు. ఆమె ద్విపాత్రాభినయంతో మస్తీ జాదే అనే చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ఆమె కవలలు క్రింద కనిపించనుంది. సన్నిలియోన్ కెరిర్ లో ఇలా డ్యూయిల్ రోల్ చేయటం తొలిసారి. తుషార్ కపూర్ ఈ చిత్రంలో హీరోగా చేస్తున్నారు. మిలాన్ జవారీ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. ప్రీతీష్ నంది కార్పోరేషన్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    'జిస్మ్‌-2'తో బాలీవుడ్‌లో ప్రవేశించింది నీలి చిత్రాల తార సన్నీలియోన్‌. ఆ తరవాత 'రాగిణి ఎం.ఎం.ఎస్‌-2' సినిమాలో అవకాశం వచ్చింది. దీంతోపాటు ఆమె 'జాక్‌పాట్‌' సినిమాలోనూ నటిచింది. హిట్ ఫ్లాఫులకు సంభందం లేకుండా ఆఫర్స్ అంది పుచ్చుకుంటోంది. ఇప్పుడు తెలుగులోనూ ఆమె ఐటం సాంగ్ చేస్తోంది.

    సన్నీలియోన్‌ సెగ తెలుగు చిత్రసీమకు తగలబోతున్న సంగతి తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ త్వరలోనే ఓ తెలుగు చిత్రంలో తళుక్కున మెరవబోతోంది. మంచు మనోజ్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం 'కరెంటు తీగ'. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సన్నీలియోన్‌ ఓ ప్రత్యేక పాత్రలో దర్శనమివ్వబోతోంది. ఈ విషయాన్ని హీరో మంచు మనోజ్ ఖరారు చేసారు.

    Sunny Leone to play twins-Laila and Lily- in 'Mastizaade'

    ఈ చిత్రం కోసం సన్నీకి ఆకర్షణీయమైన పారితోషికం కూడా ఇచ్చినట్టు సమాచారం. ఆ ఆకర్షయనీయమైన పారితోషికం..పాతిక లక్షలు అని ఫిల్మ్ నగర్ లో వినపడుతోంది. తెలుగులో సన్నీ ఒప్పుకొన్న మొదటి చిత్రమిదే కావటంతో ఇంత ఎక్కువ ఖర్చు పెట్టారంటున్నారు. హీరోయిన్ కి కూడా అంత ఇవ్వటం లేదని అంటున్నారు. అంత రెమ్యునేషన్ అనే సరికి మొదట వెనకంజ వేసారని, అయితే మనోజ్ పట్టుపట్టి మరీ ఒప్పించాడని చెప్పుకుంటున్నారు.

    మంచు మనోజ్ మాట్లాడుతూ... సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర వుంది. దీనికోసం ఎవరిని తీసుకుంటే బాగుంటుందా అని చాలా మందిని వెతికాం. అయితే అందులో నెంబర్‌వన్ ఎవరున్నారా అని వెతికితే సన్నీలియోన్ కనిపించింది. ఈ సినిమా కోసం ఆమెనే తీసుకోవడానికి ఆమెకున్న క్రేజ్ కారణం. అంతే కాకుండా ఇందులోని పాత్ర ఆమె లాంటి నటి చేస్తేనే బాగుంటుందని భావించి సన్నీలియోన్‌ను తీసుకోవడం జరిగింది అన్నారు.

    English summary
    Sunny Leone is all set to give dual treat to her fans. According to sources Sunny will be seen as twins Laila and Lillie Le Le in sex comedy Masthi Jade.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X