»   »  మీరు లైక్ కొట్టండి...నేను సాయం చేస్తా: సన్నీ లియోన్

మీరు లైక్ కొట్టండి...నేను సాయం చేస్తా: సన్నీ లియోన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకెలుతున్న సన్నీ లియోన్....ప్రస్తుతం తన తాజా చిత్రం ‘మస్తీజాదె' ప్రమోషన్లో బిజీగా గడుపుతోంది. ఇందులో భాగంగా 

సన్నీలియోన్ క్యాన్సర్ బాధిత చిన్నారులను ఆదుకునేందుకు సిద్ధమైంది. ముంబైలోని ఓషాపింగ్ మాల్ లో ‘మస్తీజాదె' చిత్ర యూనిట్ యాక్సెస్ లైఫ్ అనే స్వచ్చంద సంస్థతో కలిసి ఫండ్ రైజింగ్ కార్యక్రమం నిర్వహించారు.

Sunny Leone raising money for cancer

క్యాన్సర్ తో బాధ పడే చిన్నారులకు చికిత్స అందించడం కోసం విరాళాలు సేకరించే దిశగా ఈ సంస్థ పని చేస్తోంది. ఈ సందర్భంగా సన్నీలియోన్ చిన్నారులతో కలిసి సెల్ఫీలు తీసుకుంది. చిన్నారులతో దిగిన సెల్ఫీని ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఈ సెల్ఫీకి ఎన్ని ఎక్కువ లైక్స్, ఎన్నిఎక్కువ రీట్వీట్స్ వస్తే.... నేను, నా భర్త డేనియల్ వెబర్ కలిసి అంత ఎక్కువ డబ్బులు సహాయం చేస్తామంటూ సన్నీ లియోన్ ట్వీట్ చేసింది.


మిలప్ జవేరి దర్శకత్వంలో ‘మస్తిజాదె' చిత్రం తెరకెక్కింది. ఈచిత్రంలోసన్నీ లియోన్ లైలా, లిల్లీగా డబల్ రోల్ లో కనిపించబోతోంది. సన్నీ లియోన్ ఈ సినిమాలో ఎక్కువ భాగం బికినీలోనే కనిపించబోతోంది. సూపర్ హాట్ సెక్సీ లుక్ లో యువతను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో సన్నీ లియోన్ తన గత సినిమాల కంటే మరింత బోల్డ్ అండ్ సెక్సీ పాత్రలో అభిమానులను ఎంటర్టెన్ చేయబోతోందని అంటున్నారు.

సన్నీ లియోన్, తుషార్ కపూర్, వీర్ దాస్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ప్రితీష్ నందే కమ్యూనికేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. వాస్తవానికి ఈ చిత్రం జనవరి మొదటి వారంలోనే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ పలు కారణాలతో జనవరి 29వ తేదీకి వాయిదా పడింది. ఈ సినిమా కోసం సన్నీ లియోన్ ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.

English summary
"Raising money4cancer.Need u 2like&retweet.More U retweet&like the more cash DanielWeber99 &I give accesslifeindia" Sunny Leone tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu