»   »  నన్ను ఎవరూ గెంటేయలేదు : సన్నీ లియోన్

నన్ను ఎవరూ గెంటేయలేదు : సన్నీ లియోన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మాజీ పోర్న్ స్టార్, బాలీవుడ్ నటి సన్నీ లియోన్ గురించి రెండు రోజులుగా ఓ వార్త హాట్ టాపిక్ అయింది. ఆమెను అద్దె ఇంట్లో నుండి గెంటేసారని.....గెంటేసింది మరెవరో కాదు, ఆ ఇంటి యజమాని, మరో బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ అనే ప్రచారం జరిగింది. సెలీనా జైట్లీ, సన్నీ లియోన్ మధ్య విబేధాలు రావడం వల్లనే ఇలా జరిగిందని జాతీయ మీడియాలో సైతం వార్తలు వెలువడ్డాయి.

సన్నీ లియోన్ కు అడల్ట్ స్టార్ అనే ముద్ర ఉండటంతో ఆమెకు అద్దెకు ఇల్లు ఇవ్వటానికి ముంబైలో ఎవరూ ఉత్సాహం చూపలేదు. దాంతో అద్దె ఇల్లు దొరక్క ఇబ్బంది పడుతున్న ఆమె హీరోయిన్ సెలీనా జైట్లీ ఇంట్లో దిగింది. అయితే సన్నిలియోన్ ...శుభ్రంగా ఉండకపోవటం, అపార్టమెంట్ ని క్లీన్ గా ఉంచకపోవటం, ఫర్నీచర్ వాసన రావటం తో చిరాకెత్తిన సెలీనా జైట్లీ ఆమెను ఇమ్మిడియట్ గా ఖాళీ చేయించిందని, దీంతో ఆమె సన్నీ లియోన్...తన భర్త డానియల్ వైబర్ తో కలిసి...ఓ ఫైవ్ స్టార్ హీటల్ కూడా ఉండాల్సి వచ్చిందని జోరుగా ప్రచారం జరిగింది.

Sunny Leone rubbishes being ousted from Celina's flat

ఈ వార్తలపై సన్నీ లియోన్ స్పందించారు. తనను ఎవరూ ఇంట్లో నుండి గెంటి వేయలేదని స్పష్టం చేసారు. ఇంటి లీజు ముగియడం వల్లనే వేరే ఇంట్లోకి మారినట్లు ఆమె స్పష్టం చేసారు.

'నేను సెలీనా ఇళ్లు ఖాళీ చేసి సంవత్సరం పైనే అయ్యింది. ఒక సంవత్సరం నుంచి జాహూ ఫ్లాట్ లో ఉంటున్నా. అది చాలా బాగుంటుంది. ఈ విషయం ప్రజలందరికీ తెలుసు. నా లీజు ఒప్పందం ముగియడంతోనే సెలీనా ఇళ్లు ఖాళీ చేశా' అని సన్నీ తెలిపింది.

English summary
Actress Sunny Leone, who was earlier livig in Celina Jaitley's house here on rent, has rubbished rumours that she was asked to leave for the way she was keeping it.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu