సన్నీ లియోన్ రెమ్యూనరేషన్ వెల్లడించిన మంచు మనోజ్
హైదరాబాద్: మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న ‘కరెంట్ తీగ' త్వరలో విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. గతంలో మంచు మనోజ్ చిత్రాలకు ఎన్నడూ లేని విధంగా ఈ చిత్రం పరిశ్రమ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. అందుకు కారణం మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ఈ చిత్రంలో నటిస్తుండటమే. ఆమె చేసేది చిన్న పాత్రే అయినా....ఆమె కారణంగా సినిమాకు భారీ పబ్లిసిటీ వచ్చింది.
అందుకు తగిన విధంగానే ఆమెకు భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చేసారు. ఇటీవల ఓ టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ మంచు మనోజ్ అందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ సినిమాలో నటించినందుకు గాను ఆమెకు రూ. 75 లక్షలు ఆఫర్ చేసారట. ఆమె వల్ల సినిమాకు చేకూరే ప్రయోజనం దృష్ట్యా ఆ మాత్రం ఇవ్వడం పెద్ద విషయమేమీ కాదంటున్నారు. సన్నీ లియోన్ ఈచిత్రంలో టీచర్ పాత్రలో కనిపించనుంది. ఆమె భర్త పాత్రలో సంపూర్ణేష్ బాబు నటిస్తున్నాడు.

మంచు మనోజ్ కథానాయకుడిగా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో మంచు విష్ణు రూపొందించిన ‘కరెంట్ తీగ' ఈనెల 17న విడుదల అవ్వాల్సి ఉండగా హధూద్ తుపాను కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో సినిమా హాళ్లు తెరిచే పరిస్థితి లేక పోవడంతో విడుదల వాయిదా వేసిన సంగతి తెలసిందే. తాజాగా అందుకున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఈనెల 31న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
సంపూర్ణేష్‌బాబు, ఫిరోజ్ అబ్బాసి, గిరిబాబు, తనికెళ్ల భరణి, పవిత్రా లోకేష్, రఘుబాబు, జీవా, ఫిష్ వెంకట్, టార్జాన్, వెనె్నల కిశోర్, ధన్‌రాజ్, తా.రమేష్, సుప్రీత్, శివారెడ్డి, పృధ్వీ, సత్యకృష్ణ, కాదంబరి కిరణ్, గీతాంజలి, రవిశేఖర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:సతీష్ ముత్యాల, మాటలు:కిశోర్ తిరుమల, ఎడిటింగ్:ఎస్.ఆర్.శేఖర్, పాటలు:రామజోగయ్య శాస్ర్తీ, భాస్కరభట్ల, అనంత్ శ్రీరామ్, వరికుప్పల యాదగిరి, నిర్మాత:విష్ణు మంచు, దర్శకత్వం:జి.నాగేశ్వరరెడ్డి.


Click it and Unblock the Notifications











