సన్నీ లియోన్ చిత్రానికి రూ. 32 కోట్లు అడుగుతున్నారు!
ముంబై: సన్నీ లియోన్ సినిమాలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. తాజాగా సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో శృంగార ప్రధానమైన కథాంశంతో ‘మస్తీజాదె' చిత్రాన్ని తెరకెక్కించిన నిర్మాత ప్రితిష్ నందే భారీ ధరకు అమ్మకానికి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. రూ. 32 కోట్లు ఇస్తే ఈ చిత్రం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అమ్ముతానని అంటున్నారట.

తాము సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అమ్మడానికి పెద్ద పెద్ద సంస్థలను సంప్రదించిన మాట వాస్తవమే కానీ, ఇకా రేటు గురించి మాట్లాడలేదని నిర్మాతలు అంటున్నారు. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయింది. షూటింగ్ దాదాపుగా పూర్తయింది. 2015లో ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్లు అంచనాలు పెంచేస్తున్నాయి. 'మస్తీ జాదే' చిత్రానికి మిలాప్ జవేరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మధ్య బాలీవుడ్లో సెక్స్-కామెడీ చిత్రాలకు మంచి డిమాండ్ పెరిగిన నేపథ్యంలో సెక్సీ స్టార్ సన్నీ లియోన్‌తో ఈ సినిమా ప్లాన్ చేసారు. సన్నీ లియోన్ బాలీవుడ్లో నటిస్తున్న తొలి సెక్స్ కామెడీ చిత్రమిది. ఈ ప్రాజెక్టుపై చేయడంపై అమ్మడు చాలా ఎగ్జైట్ అవుతోంది.


Click it and Unblock the Notifications











