సన్నిలియోన్ కొత్త అడల్ట్ మూవీ టీజర్ (వీడియో)
ముంబై:తుషార్ కపూర్ టీమ్ చేసిన వందకోట్లు వసూళ్ల 'గ్రాండ్ మస్తీ' చూసి ఎంజాయ్ చేశారు బాలీవుడ్ ప్రేక్షకులు. మళ్లీ అదే టీం 'మస్తీ జాదే' అనే అడల్ట్ కామెడీ అంటూ వస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం పోస్టర్స్... తుషార్ కపూర్ అరటి పండుతో, రాకెట్ తో దిగిన కామెడీ పోస్టర్లు కొద్దిగా అతిగా ఉన్నా... టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి.
వీటికితోడు ఈ సినిమాలో హీరోయిన్‌గా సన్నీలియెన్ నటిస్తోంది. ఇంకేం.. మస్తీ మజా గ్యారంటీ అంటున్నారట బాలీవుడ్ ఆడియెన్స్. ఈ లోగా ఈ చిత్రానికి సంభందించిన టీజర్ విడుదల చేసారు. ఆ ట్రైలర్ చూసి ఎంజాయ్ చేయండి.
ఈ చిత్రం విశేషాలకు వస్తే... సన్నీ లియోన్ హీరోయిన్ గా నటించిన తాజా హిందీ చిత్రం 'మస్తీ జాదే'. పేరుకి తగ్గట్టుగానే ఈ చిత్రం మస్తీ మస్తీగా ఉంటుందట. అంటే.. జోరుగా హుషారుగా అన్నమాట. అసలు సన్నీ సినిమాలంటేనే ఈ రెండూ కామన్. కానీ, ఇప్పటివరకూ చేసిన చిత్రాల్లో ఉన్న హుషారు ఓ ఎత్తు.. ఈ చిత్రంలో ఉన్నది మరో ఎత్తు అంటున్నారు నిర్మాతలు.
ఈ చిత్రం విశేషం ఏమిటంటే... సన్నీ ఏకంగా 27 బికినీల్లో కనిపించి, కనువిందు చేయనుంది. మిలప్ జవేరీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సెన్సార్ బోర్డ్ సభ్యులు చూసి ఖంగు తిన్నారు. అంత బోల్డ్‌గా ఉంటుందట. సెన్సార్ బోర్డ్‌కు చెందిన మొదటి రెండు బోర్డ్స్ ఎగ్జామినింగ్ కమిటీ, రివైజింగ్ కమిటీ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించాయి.

దాంతో ట్రిబ్యునల్‌కు పంపించారు. చివరకు 'ఎ' సర్టిఫికెట్‌తో సెన్సార్ సమస్య క్లియరైంది. మామూలుగా అయితే మే 1న విడుదల చేద్దామనుకున్నారు. సెన్సార్‌పరమైన ఇబ్బందుల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. వచ్చే నెల 29న విడుదల చేయాలనుకుంటున్నారట.
ఇక.. సన్నీ బికినీల విషయానికొస్తే.. ఈ చిత్రానికి పని చేసిన స్టయిలిస్ట్ 'ఈ సినిమా మొత్తం మీరు దాదాపు బికినీల్లోనే కనిపిస్తారు. అందుకే మీరు సన్నబడాలి' అని చెప్పగానే సన్నీ 'అన్ని బికినీలా?' అని ఆశ్చర్యపోయారట. చివరకు కన్విన్స్ అయ్యి, తగ్గారట. సన్నీ బికినీ బాడీ చూసి, ఆమె అభిమానులు స్వీట్ షాక్‌కి గురవుతారని చిత్ర యూనిట్ అంటోంది.


Click it and Unblock the Notifications











