Don't Miss!
- News దేశంలో ఫస్ట్ టైమ్, పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పండగే పండగ !
- Sports LSG vs CSK: రూ. కోట్లు పలికిన ఆ ఇద్దరిని తప్పించాం- రుతురాజ్
- Lifestyle ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సన్నీలియోన్ టాలీవుడ్‌కి వచ్చేసింది: పీరియాడికల్ యాక్షన్ మూవీతో రానున్న సన్నీ
Recommended Video
సన్నీ లియోన్.. ఇప్పుడు బాలీవుడ్లో ఆమె ఒక స్టార్. ఎప్పుడైతే సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసే బిగ్‌బాస్ సీజన్ 5లో పార్టిసిపేట్ చేసిందో.. అప్పటి నుంచీ ఆమె పేరు ఇండియన్ ఆడియెన్స్‌కు తెలిసొచ్చింది. మహేష్ భట్ తన సినిమాలో చాన్స్ ఇవ్వడంతో సన్నీ దశ తిరిగిపోయింది. అయితే ఆమె గతంలో ఓ పోర్న్ స్టార్. ఇదే మొదట్లో ఆమెను చాలా ఇబ్బంది పెట్టింది. నిజానికి ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కుంది.ఇప్పుడు మొట్టమొదటిసారిగా తెలుగులో హీరోయిన్గా ఒక సినిమా సైన్ చేసింది.
చారిత్రాత్మక యుద్ధ నేపధ్య చిత్రం
కమర్షియల్ చిత్రాలకు పెట్టింది పేరైన వి.సి.వడివుడయన్ దర్శకత్వంలో స్టీవ్స్ కార్నర్ పతాకంపై పోన్స్ స్టిఫెన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సౌత్ ఇండియన్ కల్చర్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందున్న ఈ చారిత్రాత్మక యుద్ధ నేపధ్య చిత్రంలో సన్నీలియోన్ కథానాయికగా నటించనుంది. నవదీప్, నాజర్‌లు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించనున్నారు.
సన్నీలియోన్ కత్తి యుద్ధం
ఇందుకోసం సన్నీలియోన్ కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ మరియు కొన్ని యుద్ధ కళలను నేర్చుకొనుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక ప్రముఖ ట్రైనర్ ఈ కళలను ముంబైలో సన్నీలియోన్‌కు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం సన్నీలియోన్ ఏకంగా 150 రోజుల కాల్షీట్స్ను దర్శకనిర్మాతలకు ఇవ్వడం బట్టి సినిమాపై ఆమెకున్న నమ్మకం తెలుస్తోంది.
బాహుబలి 2.0
"బాహుబలి, 2.0" చిత్రాలకు గ్రాఫిక్స్ వర్క్ చేసిన సంస్థలు ఈ చిత్రానికి కూడా పనిచేయనున్నారు. సినిమాలో దాదాపు 70 నిమిషాల గ్రాఫిక్స్ ఉంటాయని చెబుతున్నారు. తెలుగుతోపాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రంలో టైటిల్‌ను త్వరలోనే వెల్లడించనున్నారు.
నా కల
ఈ సినిమా గురించి సన్నీలియోన్ మాట్లాడుతూ.. "ఇప్పటివరకూ నాకున్న ఇమేజ్ను పూర్తిస్థాయిలో మార్చే సినిమా అవుతుందన్న నమ్మకం ఉంది. యాక్షన్ సీక్వెన్స్‌లలో యాక్ట్ చేయాలన్నది నా కల. అది ఈ సినిమాతో నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉంది. ఇలాంటి ఒక అద్భుతమైన కథ కోసం ఎన్నాళ్ల నుండో ఎదురుచూస్తున్నాను.
2018 ఫిబ్రవరి నుండి
దర్శకుడు వి.సి.వడివుడయన్ కథ చెప్పిన మరుక్షణం నుండే ఈ సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాను. ఎప్పటి నుంచో ఒక స్ట్రయిట్ తెలుగు సినిమా చేయాలనుకొంటున్నాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడులో నాకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. వారి కోసమే ఈ సినిమా.." అని అన్నారు. 2018 ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవనున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ మరియు సెట్ వర్క్ తో జరుగుతున్నాయి.