»   » పోర్న్ సైట్లపై నిషేదం: సన్నీ లియోన్ స్పందన ఇలా...

పోర్న్ సైట్లపై నిషేదం: సన్నీ లియోన్ స్పందన ఇలా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పోర్న్ సైట్లపై కేంద్ర ప్రభుత్వం నిషేదం విధించడంతో దేశ వ్యాప్తంగా పెద్ద దుమారమే రేగింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని కొందురు స్వాగతిస్తుండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. పలువురు సినీ సెలబ్రిటీలే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఇలా చేయడం స్వేచ్ఛను హరించడమే అంటూ దుమ్మెత్తి పోసారు. అయితే కొందరు మాత్రం....ఇలాంటి బ్యాన్ చేయడం మంచిదే అంటూ సమర్థించారు.

అయితే ఈ పోర్న్ సైట్లపై బ్యాన్ అంశం తెరపైకి రాగానే... అందరి దృష్టి మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ మీదకు మళ్లింది. ఆమె ఈ అంశంపై ఎలా స్పందిస్తుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూసారు. ఆమె నేరుగా స్పందించక పోయినా ట్విట్టర్ ద్వారా తన మనోగతానికి సంబంధించిన హింట్ ఇచ్చింది. తన భర్త డేనియల్ వెబర్ తో కలిసి ఓ ఫోటో పోస్టు చేసింది. డేనియల్ వెబర్ ‘సెక్స్ సెల్స్' అనే క్యాప్షన్ ఉన్న దుస్తులు ధరించడం గమనార్హం. ఇలాంటి విషయాలకు ఆమె వీలైనంత దూరంగా ఉండాలని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Sunny Leone’s reaction

గతంలో పోర్న్ సినిమాల్లో నటించిన ఆమె ఇపుడు రూటు మార్చి బాలీవుడ్లో సెటిలైంది. వాస్తవానికి ఆమె ఇండియాలో అడుగు పెట్టడంతోనే వివాదం మొదలైంది. ఇలాంటి వారు ఇక్కడి సినిమా పరిశ్రమలో అడుగు పెడితే ఇక్కడి వారు సైతం చెడిపోతారంటూ అప్పట్లో కొందరు గగ్గోలు పెట్టారు. అయితే ఆమె పోర్న్ సినిమాలకు దూరంగా ఉంటూ కేవలం బాలీవుడ్ సినిమాల్లో మాత్రమే నటిస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పరిస్థితి సద్దుమనిగింది.

పోర్న్ సైట్లను నిషేదించడంపై బాలీవుడ్ సెలబ్రిటీలు సోనమ్ కపూర్, చేతన్ భగత్, ఉదయ్ చోప్రా, విశాల్ దల్దాని తమదైన రీతిలో స్పందించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ప్రముఖ రచయిత చేతన్ భగత్‌ కూడా పోర్న్ సైట్లను బ్యాన్ చేయవద్దని సూచించారు. ఇలా చేయడం స్వేచ్ఛను హరించడమే అన్నారు. మహిళలపై వేధింపులు, కామాతురత, అత్యాచారాలను బ్యాన్ చేయాలని కోరారు. ఇక బాలీవుడ్ నటి సోనమ్‌ కపూర్...పోర్న్‌ సైట్లను కాదు మూర్ఖులను బ్యాన్ చేయాలని సూచించారు.

English summary
The recent ban in our country has created quite a stir with as many as 857 porn sites being banned. Many celebrities came out to oppose the recent move by the government; however, all eyes were set on porn star turned actress Sunny Leone for her reaction.
Please Wait while comments are loading...