twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పేరు చెప్పి మరీ తిట్టిపోస్తున్న సన్నీలియోన్

    By Srikanya
    |

    ముంబై: ఫోర్న్ స్టార్ ఇమేజ్ నుంచి బయిటకు వచ్చి మెల్లిమెల్లిగా బాలీవుడ్‌ హీరోయిన్ గా సెటిలవుతోంది సన్నీలియోన్‌ . ఈమె ను రీసెంట్ గా బ్రిటీష్ ఎయర్ వేస్ వారు ఇబ్బంది పెట్టారు. దాంతో ఆమె సామాజిక అనుసంధాన వేదకలు ట్విట్టర్, ఫేస్ బుక్ ల సాయింతో వారిపై మండిపడుతోంది. మళ్లీ ఆ ఎయిర్ లైన్స్ వారిని ఎంకరేజ్ చేయనని, ఎక్కనని చెప్తోంది. ఇంతకీ ఏం జరిగింది.

    వివరాల్లోకి వెళ్తే... ఇటీవల ఓ సినిమా షూటింగ్‌ నిమిత్తం విదేశాలకు వెళ్లింది సన్నీ. అక్కడ నుంచి వచ్చేటప్పుడు బ్రిటీష్ ఎయర్ వేస్ విమానంలో బిజినెస్‌ క్లాస్‌ టిక్కెట్టు ఉన్న సన్నీని ఎకానమీ క్లాస్‌లో కూర్చోబెట్టారు. దీంతో ఆమెకు కోపం వచ్చేసింది. ఆ విమానం బదులుగా వేరే విమానం ఎక్కడానికి సిద్ధమైంది. అంతేకాకుండా సామన్లు హోటల్‌గదికి పంపించాలని డిమాండ్‌ చేసింది.

    సన్నిలియోన్ మాట్లాడుతూ....''బిజినెస్‌ క్లాస్‌లో వెళ్లాల్సిన నన్ను ఎకానమీ క్లాస్‌లో కూర్చోబెట్టబోయారు. నేను అంగీకరించలేదు. సామన్లు హోటల్‌ గదికి మార్చేటప్పుడు బ్యాగ్‌ పోయింది. గట్టిగా అడిగితే లేదు అన్నారు. తీరా చూస్తే నా పేరుతో ఉన్న బ్యాగ్‌కున్న ట్యాగ్‌ చింపేసి పక్కన పడేసి ఉంది. నేను సర్దుకుపోయి అదే విమానంలో వచ్చి ఉంటే ఓ చెత్త సీట్లో రావాల్సి ఉండేది. ఇంకెప్పుడూ ఆ సంస్థ విమానంలో ప్రయాణించను'' అన్నారామె.

    Sunny Leone's steamy experience in British Airways!

    సినిమాల విషయానికి వస్తే...

    సన్ని లియోన్ ఇప్పుడు ఈ పేరు బాలీవుడ్ కే కాదు తెలుగు వారికి కూడా చిపరిచతమైపోయింది. ఫోర్న్ ఇమేజ్ నుంచి ఆమె మెల్లిగా బయిటపడి హీరోయిన్ గా నిలదొక్కుకుంటోంది. అయితే షకీలా మాదిరిగా ఆమెకు అలాంటి సెక్సీ రోల్స్ వస్తున్నాయి. మంచు మనోజ్ చిత్రం కరెంట్ తీగ లో చేస్తున్న ఆమె ఇప్పుడు మరో తెలుగు హీరో సరసన నటించటానికి కమిటైంది.

    ఆ హీరో మరెవరో కాదు ..దగ్గుపాటి రానా... ఆ చిత్రం టైటిల్ ... వన్ నైట్ స్టాండ్. ముంబైలో ఈ చిత్రం షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైంది. హిందీలో నిర్మాణమయ్యే ఈ చిత్రం తెలుగులోనూ డబ్బింగ్ అవుతుందని అంటున్నారు. ఈ చిత్రానికి రాత్రి అంతా...లేదా... ఒక రాత్రి మాత్రమే అనే టైటిల్ పెట్టే అవకాసం ఉందని తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సీన్స్ ఉంటాయో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    English summary
    "British airways downgraded my business/first class ticket 2 economy.Obviously we refused 2take that seat & were thankfully switched to Jet. god works in mysterious ways.Because we refused & demanded our luggage 2check into the hotel. One bag was lost&was reported as unfound. We then go to that last spot to see if it's piled in with other pieces and there it was. No bag tag and my name tag ripped off. Crazy!!!," tweeted Sunny Leone.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X