సన్నీ అలా కనిపిస్తే.. తెరపై బ్లాస్టింగే?: ఇది మామూలు ప్రయోగం కాదు..(వీడియో)
సన్నీలియోన్.. ఇప్పుడీ పేరుకు ఉన్న మార్కెట్ అంతా ఇంతా కాదు. రీజినల్ స్టార్స్ అయితే ఆమె ముందు దిగదుడుపే అని చెప్పాలి. సన్నీ పేరుంటే చాలు.. ఏ సినిమాకైనా దేశవ్యాప్తంగా కావాల్సినంత పాపులారిటీ వస్తున్న సందర్భమిది.
అయితే సన్నీ క్రేజ్ కు కారణం ఆమెకున్న 'సెక్సీ' ఇమేజే. అలాంటి శృంగార తారను ఇప్పుడు రౌద్రం ఉట్టిపడే పాత్రలో చూపించే ప్రయత్నం జరుగుతోంది. ఇది సాహసమే అనాలో.. దుస్సాహాసమే అనాలో తెలియడం లేదు కానీ.. మొత్తానికి 'వీర మహాదేవి' పాత్రలో సన్నీ లియోన్ ను తెరపై చూడటం ఖాయమైపోయింది.

టైటిల్&లోగో లాంచ్:
తాజాగా 'వీర మహాదేవి' చిత్రానికి సంబంధించి టైటిల్&లోగోను సన్నీ లియోన్ స్వయంగా ఆవిష్కరించారు. ఓ వీడియో రూపంలో దీన్ని విడుదల చేశారు. సన్నీ వీర అభిమానులు.. ఇప్పుడీ 'వీర మహాదేవి'ని చూసి కాస్త ఆశ్చర్యపోతున్నారనే చెప్పాలి.

కనెక్ట్ అవుతారా?:
అప్పటిదాకా ఉన్న 'సెక్సీ' ఇమేజ్‍ను పూర్తిగా పక్కనపెట్టి.. చారిత్రాక నేపథ్యం ఉన్న పాత్రలో సన్నీ లియోన్ దర్శనిమిస్తుండటం ఆమె అభిమానులకు పూర్తిగా కొత్త అనుభూతినిస్తుందనే చెప్పాలి. అయితే అలాంటి తెరపై ఆమె శృంగార అభినయాన్ని ఆస్వాదించిన అభిమానులు.. ఇలాంటి రౌద్రపూరితమైన పాత్రలతో ఎంతవరకు కనెక్ట్ అవుతారో చూడాలి.
Recommended Video


నాలుగు భాషల్లో:
సన్నీ లియోన్ 'వీర మహాదేవి' కేవలం ఒక్క తెలుగుకే పరిమితమైన చిత్రం కాదు. ఈ సినిమాను ఏక కాలంలో తెలుగు, హిందీ, తమిళంలోనూ తీసినట్లు తెలుస్తోంది. సన్నీ లియోన్ మార్కెట్ రీత్యా.. అన్ని భాషల్లోనూ ఈ సినిమా కలెక్షన్లు కురిపిస్తుందని నిర్మాతలు భావిస్తున్నారట.

వీరనారి పాత్రలో:
తమిళ దర్శకుడు వడివుడైయన్ ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ చేస్తారని తెలుస్తోంది. సినిమాలో వీరనారిగా సన్నీ పోరాట ఘట్టాలు హైలైట్ గా నిలుస్తాయని చిత్ర యూనిట్ భావిస్తున్నారట.

తొలిసారి ఇలాంటి పాత్రలో:
టాలీవుడ్ లో సన్నీ లియోన్ కేవలం ఐటెం సాంగ్స్ కే పరిమితమైంది. ఇక బాలీవుడ్ లో చాలానే సినిమాలు చేసినప్పటికీ.. వాటిల్లోనూ ఆమె సెక్సీ ఇమేజ్ పైనే దృష్టి పెట్టారు. తొలిసారిగా ఒక పూర్తి డిఫరెంట్ రోల్ లో సన్నీ కనిపిస్తుండటం ఇదే తొలిసారి అని చెప్పాలి. దీంతో నటనకు సంబంధించి సన్నీ కూడా ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది.
రెమ్యునరేషన్ ఎంతంటే?:
వీర మహాదేవి సినిమా కోసం సన్నీ లియోన్‌కు రూ.4కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా గనుక హిట్ అయితే సన్నీ మార్కెట్ మరింత పెరగడం ఖాయమనే చెప్పాలి. ఇప్పటిదాకా ఆమె సెక్స్ అప్పీల్‌ను మాత్రమే చూపించిన దర్శకులు.. ఈ సినిమా తర్వాత ఆమె కోసమే కథలు రాయడం కూడా మొదలుపెడుతారేమో!..


Click it and Unblock the Notifications











