twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sunny Leone: లోన్ ఫ్రాడ్‌లో చిక్కుకున్న సన్నీ.. 2000 లోన్ విషయంలో ఎలా మోసపోయిందంటే?

    |

    ఇటీవల ఆన్ లైన్ మోసాలు మాత్రమే కాక లోన్ మోసాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. సామాన్యులు అనేక మంది బాధితులు తాము మోసపోయామంటూ ఫిర్యాదు చేస్తున్నారు అయితే వారి గోడు పట్టించుకునే నాథులు పోతున్నారు. సామాన్యులు మాత్రమే కాదు... ఇప్పుడు సెలబ్రిటీలు కూడా ఇలాంటి మోసాల్లో చిక్కుకోవడం ఇప్పుడు చర్చనీయాంశము అయింది. తాను లోన్ ఫ్రాడ్ బాధితురాలినే అంటూ సినీ నటి సన్నీ లియోన్ ట్వీట్ చేయడం సంచలనంగా మారడంతో వెంటనే ఆ కంపెనీలు రంగంలోకి దిగాయి. ఆ వివరాలు...

    సిబిల్ స్కోర్‌పై ప్రభావం

    సిబిల్ స్కోర్‌పై ప్రభావం

    నటి సన్నీలియోన్ ఇటీవల ఆన్‌లైన్ మోసానికి గురైంది. తన పాన్ కార్డును ఉపయోగించి ధని యాప్ నుండి ఎవరో 2 వేల రూపాయల రుణం తీసుకున్నారని సన్నీ లియోన్ తెలిపింది. ఈ విషయాన్ని నటి సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. గుర్తు తెలియని వ్యక్తులు తన పాన్ కార్డ్ ఉపయోగించి లోన్ తీసుకున్నారని సన్నీ లియోన్ ఆరోపిస్తోంది. లోన్ తీసుకున్న విషయం కూడా తనకు తెలియదని ఆమె ట్వీట్ చేసింది. దీని వల్ల తన సిబిల్ స్కోర్‌పై ప్రభావం పడిందని ట్విట్టర్‌లో వివరించింది. అయితే కాసేపటికే ఆ ట్వీట్‌ను తొలగించారు.

    రూ. 2, 000 రుణం

    రూ. 2, 000 రుణం

    మనీ కంట్రోల్.కామ్ నివేదిక ప్రకారం, సన్నీ లియోన్ తన పాన్ కార్డ్ ఉపయోగించి ఒక ఇడియట్ రూ. 2, 000 రుణం తీసుకున్నట్లు ట్వీట్ చేసింది. ఈ విషయంలో తనకు ఎలాంటి సహాయం అందలేదని సన్నీ పేర్కొంది. తనకు తెలియకుండానే పాన్ కార్డ్ సహాయంతో లోన్ తీసుకున్నందుకు తన సిబిల్ స్కోర్ గణనీయంగా పడిపోయిందని సన్నీ ఆరోపించింది. అయితే దీని తర్వాత సన్నీ లియోన్ మరో ట్వీట్ చేసింది, అందులో ఆమె సహాయం చేసినందుకు ఇండియా బుల్స్ సెక్యూరిటీస్‌కు ధన్యవాదాలు తెలిపింది.

    జర్నలిస్ట్ ఆదిత్య కూడా

    జర్నలిస్ట్ ఆదిత్య కూడా

    ఇండియా బుల్స్‌కు చెందిన ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్ అయిన ధని స్టాక్స్ లిమిటెడ్‌పై ఇలాంటి ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. సన్నీలియోన్ ట్వీట్ తర్వాత అనేక మంది బాధితులు ట్విట్టర్‌లో తాము ధని వద్ద ఎలా మోసపోయామో వివరించారు. జర్నలిస్ట్ ఆదిత్య కాల్రా కూడా ఈ బాధితుల జాబితాలో ఉన్నట్టు మనీకంట్రోల్ వివరించింది. తన పాన్ నెంబర్‌తో వేర్వేరు అడ్రస్‌లలో రుణాలు తీసుకున్నట్టు క్రెడిట్ రిపోర్ట్‌లో బయటపడిందని సదరు జర్నలిస్ట్ ట్వీట్ చేశారు.

     చాలా మంది

    చాలా మంది

    ఇండియాబుల్స్‌కు చెందిన ఇన్‌స్టంట్ లోన్ యాప్‌లో ధనిలో తన పాన్ నెంబర్‌తో ఈ లోన్ తీసుకున్నట్టు బయటపడిందని ఆయన ట్వీట్ చేశారు. సన్నీ లియోన్ ట్వీట్ తరువాత, చాలా మంది తమకు రుణాల కోసం కొంతమంది ఏజెంట్ల నుండి కాల్స్ వస్తున్నాయని సోషల్ మీడియాలో షేర్ చేయడం ప్రారంభించారు.

    Recommended Video

    Bigg Boss Telugu Season 5 | 18th December 2021 - Promo | ఫైనలిస్ట్ లతో ఓ ఆటాడుకున్న సీనియర్స్
    చాలా మంది

    చాలా మంది

    సన్నీ లియోన్ కంటే ముందు, షబానా అజ్మీ మరియు అమృతా రావు వంటి నటీమణులు కూడా వివిధ మాధ్యమాల ద్వారా ఆన్‌లైన్ మోసానికి గురయ్యారు. చాలా సార్లు మనం తెలిసి లేదా తెలియక ఇతరులతో పాటు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, వంటి ముఖ్యమైన పత్రాలను పంచుకోవడం చాలా సార్లు జరుగుతుంది. అలాగే లోన్ ఇవ్వాలంటే ఏ వివరాలు అన్నీ కావాలని అడిగి తీసుకునే కొన్ని యాప్‌లు కూడా ఉన్నాయి. ఎప్పుడు ఏమైనా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్త వహించండి.

    English summary
    Sunny Leone says she became victim of loan fraud.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X