»   » రాజశేఖర్ నెక్ట్స్ మూవీలో సన్నీ లియోన్!

రాజశేఖర్ నెక్ట్స్ మూవీలో సన్నీ లియోన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మాజీ పోర్న్ స్టార్, ప్రస్తుతం బాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకోలుతున్న సన్నీ లియోన్ త్వరలో మరో తెలుగు సినిమాలో మెరవబోతోంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రాజేశేఖర్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కోసం సన్నీ లియోన్ ను సంప్రదించినట్లు సమాచారం.

'పిఎస్‌వి గరుడ వేగ' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సన్నీ లియోన్ తో స్పెషల్ సాంగ్ చేయించబోతున్నట్లు తెలుస్తోంది. సన్నీ లియోన్ సినిమాలో ఉంటే సినిమాకు మంచి క్రేజ్ వస్తుందనే ఉద్దేశ్యంతో కాస్త ఖర్చు ఎక్కువైనా ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. గతంలో సన్నీ లియోన్ మంచు మనోజ్ కంరెంట్ తీగ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

పిఎస్‌వి గరుడ వేగ

పిఎస్‌వి గరుడ వేగ

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. డిఫరెంట్ కాన్సెప్టుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాజశేకర్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నారు. పిఎన్‌వి గరుడ వేగ 126.18ఎం అనే మిషన్ కాన్సెప్టుతో ఈ సినిమా ఉండబోతోందట. సినిమా జార్జియాలోనే చిత్రీకరణ జరుపుకుందని సమాచారం.

పూజా కుమార్

పూజా కుమార్

ఈ చిత్రంలో రాజశేఖర్ సరసన ‘విశ్వరూపం' ఫేమ్ పూజా కుమార్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. వేసవిలో సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

సన్నీ లియోన్

సన్నీ లియోన్

సన్నీని ఐటెమ్ సాంగ్ కోసం నిర్మాతలు సంప్రదించినట్టు తెలుస్తుంది. భారీ మొత్తం ఆఫర్ చేయడంతో సన్నీ కూడా ప్రాజెక్టులో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

ఎంత పద్దతిగా ఉందో: సన్నీ లియోన్ కండోమ్ యాడ్ వీడియో

ఎంత పద్దతిగా ఉందో: సన్నీ లియోన్ కండోమ్ యాడ్ వీడియో

కండోమ్ యాడ్స్ అంటే అశ్లీలత ఉట్టిపడేలా ఉంటాయనే భావన మొదటి నుండి ఉంది. గతంలో వచ్చిన కొన్ని కండోమ్ యాడ్ వీడియోలు కూడా ఇలాంటి అభిప్రాయం ఏర్పడటానికి కారణం. తాజాగా మ్యాన్ ఫోర్స్ కండోమ్ సంస్థ సన్నీ లియోన్ పై చిత్రీకరించిన యాడ్ అందుకు భిన్నంగా ఉంది. యాడ్ వీడియో చూసేందుకు క్లిక్ చేయండి.

English summary
Action star Rajasekhar comeback film PSV Garuda Vega 126.18M under Praveen Sattaru’s direction to have Sunny Leone for the special song in the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X