సన్నిలియోన్...మొగుడ్ని కూడా దించింది
ముంబై : ఫోర్న్ స్టార్ నుంచి వెండితెర మహారాణిగా ఎదుగుతున్న సన్ని లియోన్ ఇప్పుడు తన భర్త డేనియల్ ని రంగంలోకి దింపుతోంది. ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో కనిపంచనున్నారు. అయితే వీరిద్దరూ జంటగా నటించడం లేదు. ఎవరి పాత్రలు వారివే. సన్నీలియోన్ నటిస్తున్న సినిమాతోనే ఆమె భర్త కూడా బాలీవుడ్‌లో అడుగుపెట్టాలని తొలి నుంచీ అనుకుంటున్నారు. ఇప్పుడు అది నెరవేరబోతోంది.
వివరాల్లోకి వెళితే... ప్రస్తుతం'రాగిణి ఎం.ఎం.ఎస్-2' సినిమాతో తీరిక లేకుండా గడుపుతోంది సన్నీలియోన్. దీని తరవాత ఆమె నటించబోయే సినిమా కూడా ఖరారైంది. కైజాద్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రంలో ఆమె హీరోయిన్ గా ఎంపికైంది. ఇందులో ఆమె భర్త డేనియల్ వెబర్ కూడా ప్రధాన పాత్రను పోషించబోతున్నారు.
సన్నీలియోన్ చెబుతూ ''డేనియల్ మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తున్నారు. త్వరలోనే ఆయన ఆల్బమ్ ఒకటి విడుదల కాబోతోంది. ఇప్పుడు బాలీవుడ్‌లో ఆయన నటించనుండటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆయన నటిస్తున్న సినిమాలో నేను కూడా ఉండటం నా ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది'' అని వెల్లడించింది.


Click it and Unblock the Notifications












