»   » చూసినోళ్ళకు 'జాక్‌పాట్‌' : ఫ్యాంట్ జిప్ తీసి మరీ ఆమె

చూసినోళ్ళకు 'జాక్‌పాట్‌' : ఫ్యాంట్ జిప్ తీసి మరీ ఆమె

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : 'జిస్మ్‌-2'తో బాలీవుడ్‌లో ప్రవేశించింది నీలి చిత్రాల తార సన్నీలియోన్‌. అయితే ఆ సినిమా ఆమెకు నిరాశనే మిగిల్చింది. ఆ తరవాత 'రాగిణి ఎం.ఎం.ఎస్‌-2' సినిమాలో అవకాశం వచ్చింది. దీంతోపాటు ఆమె 'జాక్‌పాట్‌' సినిమాలోనూ నటిస్తోంది. కైజాద్‌ గుస్తద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. సచిన్‌ జోషి హీరో. ప్రస్తుతం గోవాలో వేగవంతంగా జరుగుతోంది. ఈ చిత్రంలో ఫోటోలను కొన్నిటిని మీడియాకు విడుదల చేసారు. వీటిలో సన్నిలియోన్ ఫ్యాంట్ జిప్ విప్పుతున్న ఫోటో యువతను విపరీతంగా ఎట్రాక్ట్ చేస్తూ,సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో తిరుగుతోంది.

  ఈ చిత్రంలో సన్నీ లియోన్ రూపం అందంగా, ఆకట్టుకునే విధంగా సెక్సీగా ఉండటం గమనార్హం. సచిన్ జోషి ఈ చిత్రంలో డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నారు. ఓ డిఫరెంట్ కథాంశంతో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జాక్ పాట్ కు సంబంధించిన ఓ గేమ్ చుట్టూ ఈచిత్రం కథ తిరుగుతుంది.

  అయితే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో నటించేందుకు సన్నీలియోన్‌ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.సన్నీ లియోన్‌ కెరీర్ బాలీవుడ్లో సజావుగానే సాగుతోంది. బిగ్‌బాస్ రియాల్టీ షో ద్వారా ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలోకి అడుగు పెట్టిన సన్నీ లియోన్ 'జిస్మ్-2' చిత్రంతో హీరోయిన్‌గా మారిన సంగతి తెలిసిందే. ఫోర్న్ స్టార్ కావడంతో నగ్నంగా అందాలు ఆరబోయడానికి ఏమాత్రం సంకోచించని తత్వం కావడంతో పలువురు బాలవుడ్ నిర్మాతలు, దర్శకుడు ఆమెతో న్యూడ్ సీన్లు, హాట్ ఐటం సాంగులు చేయించి సొమ్ము చేసుకోవాలనే ప్రయత్నాల్లోకి దిగి పోయారు.


  దీనికి తోడు సన్నీ లియోన్ న్యూడ్ అండ్ హాట్ ఫోటో షూట్లు అంతర్జాలాన్ని ముంచెత్తడంతో సన్నీ లియోన్ ఇండియాలో టాప్ సెలబ్రిటీగా మారి పోయింది. ఇక సన్నీలియోన్ భారత్ లో అడుగు పెట్టిన కొత్తలో చాలా మంది వ్యతిరేకించారు. అలాంటి వాళ్లను ఇండియా ఎంటర్ టైన్మెంట్ రంగంలోకి అడుగు పెట్టనివ్వడం వల్ల అనర్ధాలు జరిగిపోతాయని, ఆమె నీలి చిత్రాలు భారతీయ యవతపై చెడు ప్రభావం చూపుతాయని వ్యతిరేకించారు. విషయం కేంద్ర ప్రభుత్వానికి కంప్లయింట్ చేసే వరకు వెళ్లింది.

  ఆమె ఫోటోలు..స్లైడ్ షో లో...

  ‘జాక్ పాట్' ఎవరికి

  ‘జాక్ పాట్' ఎవరికి

  ప్రస్తుతం సన్నీ లియోన్ హీరోయిన్‌గా బాలీవుడ్లో రెండు చిత్రాలు తెరకెక్కుతున్నాయి. అందులో ఒకటి రాగిని ఎంఎంఎస్-2 ఒకటి కాగా, మరొక చిత్రం ‘జాక్ పాట్'. ఇటీవల ‘జాక్ పాట్' చిత్రం ఫస్ట్ లుక్ రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు స్టిల్స్, పోస్టర్స్ తో హంగామా చేస్తోందిది. తప్పనిసరిగా ప్రేక్షకులకు ఈ చిత్రం ‘జాక్ పాట్' తగిలిన అనుభూతి కలిగిస్తుందని చెప్తున్నారు.

  ఫోటో షూట్స్ అందుకే..

  ఫోటో షూట్స్ అందుకే..

  నటిగా తొలి అడుగులు వేసేటప్పుడు శిక్షణ తీసుకోవడం సాధారణమే. అయితే ఈ చిత్రంలో సన్నీ భిన్నమైన భావోద్వేగాల్ని పలికించాల్సి ఉందట. అయితే ఆమెకి వాణిజ్యపరమైన చిత్రాల్లో నటించిన అనుభవం లేదు. హావభావ ప్రకటనలో ఇబ్బందులు ఎదురు కాకుండా ఆమె కోసం శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఈ చిత్రంకు క్రేజ్ తేవటంలో భాగంగా ప్రత్యేకమైన ఫోటో షూట్ ని ఏర్పాటు చేస్తున్నారు.

  మాననంటోంది..

  మాననంటోంది..

  నీలి చిత్రాల తార సన్నీలియోన్ బిగ్ బాస్ షో ద్వారా భారత్‌లో అడుగు పెట్టడం, మహేష్ భట్ నిర్మిస్తున్న ‘జిస్మ్2' చిత్రంలో అవకాశం దక్కించుకోవడం తెలిసిందే. బాలీవుడ్‌ అవకాశాలు రావడం మొదలు పెట్టాక ఆ పాడు సినిమాల్లో నటించడం మానేస్తుందని అంతా భావించారు. అలాంటిదేమీ లేది, బాలీవుడ్ సినిమాల కోసం ఫోర్న్ చిత్రాల్లో నటించడం మానేయబోనని, ఆ సినిమాల ద్వారానే నేను ఇంత పెద్ద స్టార్ ను అయ్యాను, అవి పాడు సినిమాలు కాదు, వ్యభిచారం అంతకంటే కాదు, శృంగారం గురించి తెలుసుకోవడానికి, శృంగార రసాన్ని తెరపై చూసి ఆనందించడమే ఆ సినిమాల ఉద్దేశ్యం, అవి ఫారిన్‌లో చట్టబద్దతే అని తెగేసి చెబుతోంది.

  ఇదే ఆమె కొత్త ఫోర్న్

  ఇదే ఆమె కొత్త ఫోర్న్

  ప్రస్తుతం సన్ని లియోన్ ‘బ్లాక్ షామా' అనే ఫోర్న్ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం ‘జిస్మ్ 2' చిత్రం కంటే ముందే విడుదలకు సిద్ధం అవుతున్నటన్లు సమాచారం. ఓ అంతర్జాతీయ వెబ్ సైట్ ప్రచురించిన కథనం ప్రకారం ఈ చిత్రంలో సన్నీ లియోన్ జెన్నీ సింగ్‌గా నటిస్తోందని, ప్రతీకారం తీర్చుకునే నేపథ్యంలో ఆమె పాత్ర ఉంటుందని తెలుస్తోంది. కథను ఫాలోఅవుతూ, స్క్రిప్టులో భాగంగానే సెక్స్ సీన్లు ఉంటాయట. సన్నీలియోన్ ఫోర్న్ చిత్రాలపై భారత్‌లో చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అంటూ సదరు వెబ్ సైట్ పేర్కొంది.

  అంతా సపోర్ట్

  అంతా సపోర్ట్

  కేసు వేసినప్పుడు ప్రెస్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడితో పాటు చాలా మంది ప్రముఖులు సన్నీకి అనుకూలంగా మాట్లాడటం గమనార్హం. ఆమె ఫోర్న్ చిత్రాల్లో నటించినంత మాత్రాన తప్పు చేసినట్లు కాదు, ఆ దేశాల్లో అవి చట్టబద్దమే, ఇక్కడ అలాంటివి చేయడం లేదుకదా అంటూ ఎదురు ప్రశ్నించారు.

  వర్మ వంటి వారు సైతం...

  వర్మ వంటి వారు సైతం...

  ఇక రామ్ గోపాల్ వర్మ, పూనమ్ పాండే లాంటి వారు ఆమెకు పరోక్షంగా మద్దతు ఇచ్చారు. ఇండియాలో ఫోర్న్ సినిమాలను చట్టబద్దం చేయాలి, వాటిపై నిషేదం విధించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు, ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ లో, సెల్ ఫోన్లలో వాటిని చాటు మాటుగా వీక్షిస్తూనే ఉన్నారంటూ స్టేట్ మెంట్లు ఇచ్చారు

  మారని ఇమేజ్ ...

  మారని ఇమేజ్ ...

  ఎంత కాదన్నా.... సన్ని లియోన్ ఎన్ని కబుర్లు చెప్పినా ఆమె ఫోర్న్ స్టార్ ఇమేజ్ ఆమెను వదలటం లేదు. దాంతో ఆమెను తమ సినిమాల్లో చేయటానికి ఓ మాదిరి హీరోలు కూడా ఒప్పుకోవటం లేదు. సన్నిలియోన్ తో చేస్తే తమ సినిమాలకు ప్యామలీ ఇమేజ్ దెబ్బతింటుందని భావిస్తున్నారు. మహేష్ భట్ క్యాంప్, ఏక్తా కపూర్ తప్ప.. సన్నిలియోన్ తో చేసే ధైర్యం చేయటం లేదు. అయితే తాను బాలీవుడ్ లో సెటిల్ అవ్వటానికే వచ్చానని సన్ని చెప్పటం విశేషం.

  తెరను వేడిక్కిస్తూ..కిక్కిస్తూ...

  తెరను వేడిక్కిస్తూ..కిక్కిస్తూ...

  ‘జిస్మ్-2' చిత్రంతో పరిచయమైన ఈ ఫోర్న్ స్టార్.. అందచందాల ప్రదర్శనతో బాలీవుడ్ వేడిక్కిపోయింది. నటనకన్నా ఆమె శరీరంపైనే కెమెరాల దృష్టి. అది గమనించిన ఈ ముద్దుగుమ్మ ఇలా తను కేవలం ఫోర్న్ స్టార్ ని కాదు భారతీయ సంస్కృతిలో కూడా కలిసిపోగలని చెప్తోంది.

  English summary
  Trailer of the the con-thriller has crossed over 8.5 million hits online in under 10 days. A source close to the production house says, "Compared to other recent and upcoming films, such as Boss, Grand Masti and Shaadi Ke Side Effects, Jackpot has got more hits and in a shorter period. It reached the 5 million mark in just three days."
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more