మొగుడితో కలిసి ఎంట్రీ ఇచ్చిన పోర్న్ స్టార్ సన్నీ!
పోర్న్ స్టార్ సన్నీ లియోన్ త్వరలో తన బాలీవుడ్ తొలి మూవీ 'జిస్మ్ 2' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 3న ఈచిత్రం ఇండియా వ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రచార కార్యక్రమంలో భాగంగ సన్నీ లియోన్ తన భర్త డేనియల్ వెబర్‌తో ఇండియాలో అడుగుపెట్టింది.
సినిమా విడుదల రోజు నుంచి దేశంలోని ప్రధాన నగరాలు తిరుగుతూ సన్నీ లియోన్ సినిమా ప్రమోషన్లలో పాల్గొననుంది. రియల్ లైఫ్ లో పోర్న్ స్టార్ అయిన సన్నీ....జిస్మ్ 2 చిత్రంలోనూ పోర్న్ స్టార్ పాత్రనే చేస్తుండటం గమనార్హం. ఈచిత్రంలో ఆమె అందాల ఆరబోత....తన సహ నటులు అరుణోదయ్ సింగ్, రణదీప్ హుడాలతో చేసే రొమాన్స్ అభిమానులను మత్తెక్కించనున్నాయి.
పోర్న్ స్టార్‌గా వృత్తి సాగిస్తున్న మహిళ....ప్రేమలో పడి ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంది అనేది ఈచిత్రం కథాంశం. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఈచిత్రం ఉంటుందని, భావోద్వేగాలు ప్రేక్షకులు ఆకట్టుకుంటాయని, రొమాంటిక్ సీన్స్ అలరిస్తాయని అంటున్నారు నిర్మాత మహేష్ భట్, దర్శకులు రాలు పూజా భట్. మరి పెద్దలకు మాత్రమే పరిమితం అయిన A సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో అనేది శృంగార ప్రియుల్లో ఆసక్తి నెలకొంది.


Click it and Unblock the Notifications












